కేరళలో కరోనా విలయ తాండవం.. పెరుగుతున్న కేసులు..

కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం నాడు కొత్తగా మరో 927 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేరళ..

కేరళలో కరోనా విలయ తాండవం.. పెరుగుతున్న కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 3:20 AM

కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం నాడు కొత్తగా మరో 927 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో ఇప్పుడు 9,655 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. అయితే ఆదివారం నాడు నమోదైన కేసుల్లో 733 మందికి కాంటాక్ట్ ద్వారా సోకిందని.. 67 మందికి కరోనా ఎలా సోకిందన్న దానిపై స్పష్టత రావడం లేదన్నారు. 76 మంది విదేశాల నుంచి వచ్చిన వారికి రాగా.. 91 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సోకింది. ఇక ఆదివారం నాడు కరోనా నుంచి కోలుకుని 689 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి 61 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం 494 కరోనా హాట్‌స్పాట్స్‌ను గుర్తించారు.