నీ ఎత్తు నాకో లెక్కా..? ‘కిలిమంజారో’ కుర్రాడి సాహసం

పర్వతారోహణ అన్నది ఎంత కష్టమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని అధిరోహించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో. అలాంటిది ఓ తొమ్మిదేళ్ల బుడతడు మాత్రం పర్వతారోహణలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. పుణెకు చెందిన అద్వైత్ భార్తియా అనే తొమ్మిదేళ్ల పిల్లాడు ఇటీవల ఆఫ్రికాలోని అతి పెద్ద పర్వతం కిలిమంజారోను అధిరోహించాడు. సముద్ర మట్టానికి 19,341అడుగుల ఎత్తున్న ఈ పర్వతాన్ని మన బుడతడు ఏడు రోజుల్లో ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జూలై 31న సమిర్ […]

నీ ఎత్తు నాకో లెక్కా..? ‘కిలిమంజారో’ కుర్రాడి సాహసం
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2019 | 5:09 PM

పర్వతారోహణ అన్నది ఎంత కష్టమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని అధిరోహించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో. అలాంటిది ఓ తొమ్మిదేళ్ల బుడతడు మాత్రం పర్వతారోహణలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. పుణెకు చెందిన అద్వైత్ భార్తియా అనే తొమ్మిదేళ్ల పిల్లాడు ఇటీవల ఆఫ్రికాలోని అతి పెద్ద పర్వతం కిలిమంజారోను అధిరోహించాడు. సముద్ర మట్టానికి 19,341అడుగుల ఎత్తున్న ఈ పర్వతాన్ని మన బుడతడు ఏడు రోజుల్లో ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జూలై 31న సమిర్ పతామ్ అనే యాత్ర నాయకుడుతో కలిసి ఈ పర్వతాన్ని ఎక్కిన అద్వైత్.. ఇందుకోసం ముందుగా రెండు నెలలు శిక్షణ తీసుకున్నాడు.

కాగా దీనిపై ఈ బుడతడు మాట్లాడుతూ.. ‘‘ఈ ట్రెక్కింగ్ చాలా కష్టమైనది. కానీ అందులో ఒక ఆనందం కూడా ఉంది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను ఎక్కే సమయంలో మేము చెక్క ఇళ్లలో ఉండేవాళ్లం కానీ కిలిమంజారోను అధిరోహించే సమయంలో మంచు గడ్డల మధ్యన చిన్న చిన్న టెంట్లలో నివసించాల్సి వచ్చేది. అదో అద్భుత అనుభవం. ఈ పర్వతాలను ఇంకా త్వరగా ఎక్కి ఉండాల్సింది. అయితే అక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూసేందుకు చాలా బ్రేక్‌లు తీసుకున్నా. ఇక పర్వతాలపైకి వెళ్లేటప్పుడు కొంత దూరం వెళ్లాక ఆక్సిజన్ శాతం తగ్గిపోతూ ఉంటుంది.. మరికొన్ని చోట్ల మైనస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి.. వాటన్నింటిని తట్టుకొని పర్వతాలు ఎక్కడం సాహసంతో కూడిన చర్య’’ అని చెప్పుకొచ్చాడు.

కాగా అద్వైత్ ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే (2016లో) ప్రపంచంలోనే అతి పెద్ద పర్వతమైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ వరకు ఎక్కి రికార్డు సృష్టించాడు. ఇక వచ్చే ఏడాది యూరప్‌లోని అతి పెద్ద పర్వతం ఎల్బ్రస్‌ను అధిరోహించాలనుకుంటున్నానని తన కోర్కెను బయటపెట్టాడు ఈ బుడతడు.

ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..