అచ్చు సినిమాలోలా.. కిందపడి లేచి గుర్రం పందెం గెలిచాడు

‘‘పందెం మధ్యలో హీరో పడిపోవడం, ఆ తరువాత లేచి అనూహ్యరీతిలో పందెంను గెలవడం’’ ఇలాంటి సన్నివేశాలను మనం చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అయితే నిజ జీవితంలో అలానే ఓ గుర్రం పందెంను గెలిచాడు బుడతడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A nine-year-old boy, riding a galloping horse, fell off from it during a race. However, he immediately stood up and […]

అచ్చు సినిమాలోలా.. కిందపడి లేచి గుర్రం పందెం గెలిచాడు
Follow us

| Edited By:

Updated on: Mar 20, 2019 | 10:29 AM

‘‘పందెం మధ్యలో హీరో పడిపోవడం, ఆ తరువాత లేచి అనూహ్యరీతిలో పందెంను గెలవడం’’ ఇలాంటి సన్నివేశాలను మనం చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అయితే నిజ జీవితంలో అలానే ఓ గుర్రం పందెంను గెలిచాడు బుడతడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బెంగళూరులోని చిక్కోడి తాలుకా కేరూరు గ్రామంలో గుర్రం పందేలను పెట్టారు. అందులో 9ఏళ్ల బాలుడు తన అశ్వాన్ని పరుగులు పెట్టించాడు. అయితే అనుకోకుండా మధ్యలో గుర్రంతో సహా  కిందపడ్డాడు బాలుడు. ఆ సమయంలో అతడికి తృటిలో ప్రమాదం తప్పింది.  వెంటనే లేచిన గుర్రం ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పరుగును ప్రారంభించింది. ఇక ఆ బాలుడు కూడా బైక్ సహాయంతో సినిమాలోలాగా గుర్రాన్ని అందుకొని రేస్‌లో విజయం సాధించాడు. కిరణ్ పరాష్కర్ అనే నెటిజన్ పెట్టిన ఈ వీడియో వైరల్ అవ్వగా.. బాలుడి ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.