మహా పోల్స్: ఆశ్చర్యపరిచే అంశాలివే..!

ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాస్త అటో ఇటో బిజెపి, శివసేన పార్టీలకు అనుకూలంగానే వచ్చాయి. రెండు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్యా బలం రెండు పార్టీలు కలిసి పొందాయి. అయితే.. ఈ విజయం బిజెపిలో మాత్రం పెద్దగా ఆనందాన్నివ్వలేదు. ఎన్డీయేలోని శివసేనకు, యుపిఏలోని ఎన్సీపీకి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కొత్త ఊపునిచ్చాయనే చెప్పాలి. గత ఎన్నికల్లో భేషజానికి పోయిన శివసేన ఒంటరిగా పోటీచేసి అధికారానికి దూరమైంది. ఇపుడు తెలివిగా బిజెపితో […]

మహా పోల్స్: ఆశ్చర్యపరిచే అంశాలివే..!
Follow us

|

Updated on: Oct 25, 2019 | 5:30 PM

ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాస్త అటో ఇటో బిజెపి, శివసేన పార్టీలకు అనుకూలంగానే వచ్చాయి. రెండు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్యా బలం రెండు పార్టీలు కలిసి పొందాయి. అయితే.. ఈ విజయం బిజెపిలో మాత్రం పెద్దగా ఆనందాన్నివ్వలేదు. ఎన్డీయేలోని శివసేనకు, యుపిఏలోని ఎన్సీపీకి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కొత్త ఊపునిచ్చాయనే చెప్పాలి.

గత ఎన్నికల్లో భేషజానికి పోయిన శివసేన ఒంటరిగా పోటీచేసి అధికారానికి దూరమైంది. ఇపుడు తెలివిగా బిజెపితో జతకట్టి.. ఆ పార్టీని 150 స్థానాల్లోనే పోటీ చేసేట్లు చేసి.. 104 సీట్లకే పరిమితం చేసింది. తాము మాత్రం బిజెపి తోసిపుచ్చలేని స్థాయిలో సీట్లు గెలుచుకున్నారు శివసేన నేతలు. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు భిన్నంగా అందరినీ అబ్బురపరుస్తూ వచ్చిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు గమనిస్తే మరిన్ని ఆశ్చర్యకరమైన అంశాలు కనిపిస్తున్నాయి. అవేంటంటారా.. రీడ్ దిస్ స్టోరీ..

భారీ సంఖ్యలో మంత్రుల ఓటమి:

బిజెపి తరపున ఎన్నికల బరిలో దిగిన సిట్టింగ్ మంత్రులు మొత్తం 9 మంది ఓటమి పాలయ్యారు. అంటే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మినహా పెద్ద సంఖ్యలో మంత్రులు ప్రజల మద్దతును చురగొనలేకపోయారు. దివంగత గోపినాథ్ ముండే తనయురాలు గత ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి పంకజాముండే తన కజిన్ బ్రదర్ ధనుంజయ్ ముండే చేతిలో పరాజయం పాలయ్యారు. మరో మంత్రి రాం షిండే కూడా దారుణంగా 40 వేల ఓట్ల తేడాతో ఎన్సీపీ క్యాండిడేట్ రోహిత్ పవార్ చేతిలో పరాజయం పాలయ్యారు. మొత్తమ్మీద ఇద్దరు కేబినెట్ హోదా మంత్రులు, ఏడుగురు సహాయ మంత్రులను మహారాష్ట్ర ఓటర్లు తిరస్కరించారు.

మోదీ సభలు నిర్వహించిన 3 చోట్ల పరాజయం:

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజెపి తరపున ప్రచార సభలు నిర్వహించిన మూడు స్థానాల్లో బిజెపి పరాజయం పాలయ్యింది. మొత్తమ్మీద మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోదీ మొత్తం 9 చోట్ల సభల్లో ప్రసంగించారు. బిజెపికి ఓటేయాలని ఓటర్లను కోరారు. అయితే ఆయన సభలు నిర్వహించిన చోట్లలో పర్లి సీటు అత్యంత కీలకమైంది. అక్కడ్నించి పంకజా ముండే పోటీచేసి, సోదరుని చేతిలో పరాజయం పాలయ్యారు.

పలు చోట్ల రెండో స్థానంలో నోటా:

మహారాష్ట్రలోని పలు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నోటా ఓట్ల సంఖ్య వుండడం ఆశ్చర్యానికి గురిచేసింది. లాతూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, దివంగత విలాస్ రావ్ దేశ్‌ముఖ్ తనయుడు ధీరజ్ దేశ్‌ముఖ్ విజయం సాధించగా.. రెండో స్థానంలో నోటాకు 27 వేల 287 ఓట్లు వచ్చాయి. అదే విధంగా పాలస్-కడేగావ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కదం విశ్వజిత్ పతంగ్ రావు విజయం సాధించగా.. రెండో స్థానంలో నోటాకు 20 వేల 631 ఓట్లు పడ్డాయి. ముంబయి మహానగరం పరిధిలోని బోరివలి సీటులో పదివేలకు పైగా ఓట్లు నోటాకు పడ్డాయి.

సొంత నియోజకవర్గంలో శివసేన ఓటమి:

దశాబ్దాలుగా ముంబయి మహానగరాన్ని శాసించిన మాతో శ్రీ (శివసేన అధినేత బాలా థాక్రే నివాసం..ప్రస్తుతం ఉద్దవ్ థాక్రే రెసిడెన్స్) వున్న బాంద్రా ఈస్ట్ నియోజకవర్గంలో శివసేన దారుణంగా ఓటమి పాలైంది. శివసేన తరపున ముంబయి నగర మేయర్ మహాడేశ్వర్ పోటీ చేసి… కాంగ్రెస్ అభ్యర్థి జీషన్ సిద్దిఖీ చేతిలో ఓడిపోయారు.

ఆదిత్య థాక్రేకు ఎంబర్రాస్‌మెంట్:

దివంగత బాలా థాక్రే మనవడు.. ప్రస్తుత శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే తనయుడు.. తొలిసారి ఆ ఫ్యామిలీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగిన ఆదిత్య థాక్రే వర్లి నియోజకవర్గంలో గెలుపొందారు. కానీ ఈ విజయం ఆయనకు అంతగా ఆనందాన్నివ్వని విషయం ఏంటంటే.. ఈ నియోజకవర్గంలో ఆయనకు 89 వేల 248 ఓట్ల మెజారిటీ రాగా.. 6 వేల 245 ఓట్లు నోటాకు పడ్డాయి. ఈ విషయం యువనేతకు మింగుడు పడని విషయం. తాజా పరిణామాల్లో ఆధిత్య థాక్రే మహారాష్ట్రకు యంగెస్ట్ సీఎం లేదా డిప్యూటీ సీఎం కావచ్చు గాకా.. కానీ సొంత నియోజకవర్గంలో నోటా సంఖ్య పెరగడాన్ని మాత్రం ఆయన ఎప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి.

ఎం.ఎన్.ఎస్. కథ క్లోజ్ :

ఉద్దవ్ థాక్రేకు పోటీగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన స్థాపించిన ఒకప్పటి బాలా థాక్రే కుడిభుజం రాజ్ థాక్రే కథ ఇక కంచికే అని స్పష్టం చేశాయి మహారాష్ట్ర ఎన్నికలు. గత ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి.. కేవలం ఒకేసీటును గెల్చుకున్న ఎం.ఎన్.ఎస్. ఈసారి కూడా ఒకే సీటుకు పరిమితమైంది. ఎన్నికలకు ముందు సోనియాతో భేటీ అయి.. వారి మద్దతు పొందేందుకు వృధాయత్నం చేసిన రాజ్ థాక్రేకు ఈ ఫలితాలు అశనిపాతంలా మారాయి. ఎం.ఎన్.ఎస్. తరపున పోటీ చేసిన ప్రమోద్ రాజు రతన్ ముంబయి శివార్లలోని కల్యాణ్ రూరల్ సీటులో శివసేన అభ్యర్థి రమేశ్ మాత్రేను ఓడించారు. అయితే.. ఒక్క ఎమ్మెల్యేతో ఎం.ఎన్.ఎస్.ను ఎంతకాలం కొనసాగిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎం.ఎన్.ఎస్. కథ ఇక క్లోజ్ అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కొంకణ్ ప్రాంతంలో నో కాంగ్రెస్:

సింధుదుర్గ్, రత్నగిరి, రాయ్‌గఢ్, థానే, పాల్ఘర్ కలిపి అయిదు జిల్లాలతో కూడిన కొంకణ్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీటును గెల్వలేకపోయింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేసిన ఎన్సీపీ మాత్రం కొన్ని సీట్లతో సరిపెట్టుకుంది. శివసేన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. బిజెపి కూడా కొంకణ్ ఏరియాలో పరవాలేదనిపించింది.

పశ్చిమలో ఎన్సీపీ హవా:

మహారాష్ట్ర ఎన్నికల్లో దాదాపు శివసేనతో సమానంగా సీట్లు పొందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పశ్చిమ మహారాష్ట్రలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ పార్టీ మొత్తం 54 సీట్లు గెలుచుకోగా.. అందులో 28 సీట్లు ఒక్క పశ్చిమ మహారాష్ర్ట ప్రాంతం నుంచే గెలుచుకుంది. మొదట్నించి శరద్ పవార్‌కు బాగా పట్టున్న ఈ ప్రాంతంలో బిజెపి, శివసేన దూకుడును ఎన్సీపీ నిలువరించడంతోనే మహారథి కూటమి అనుకున్నట్లుగా 200 సీట్లను గెలుచుకోవడంలో వెనుకబడిందని చెప్పాలి.

రెండు చోట్ల శివసేన, బిజెపి ఢీ:

మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి, శివసేన కలిసి మహారథి కూటమి పేరిట పోటీ చేసినప్పటికీ ఈ రెండు పార్టీలు రెండు నియోజకవర్గాల్లో పరస్పరం పోటీ పడ్డాయి. ఇరు పార్టీల అంగీకరం ప్రకారం కంకావలి, మన్ నియోజకవర్గాలు బిజెపికి కేటాయించారు. అయితే శివసేన రెబల్ అభ్యర్థులు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బరిలో నిలిచారు. కంకావలిలో బిజెపి తరపున నితీశ్ నారాయణ్ రాణే బరిలోకి దిగగా.. శివసేన రెబల్ అభ్యర్థి సతీష్ జగన్నాథ్ సావంత్ పోటీకి దిగారు. నితీశ్ భారీ మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. మన్ నియోజకవర్గంలో బిజెపి తరపున జయ్ కుమార్ భగవన్ రావు గోరే… శివసేన రెబల్ అభ్యర్థి శేఖర్ గోరేపై విజయం సాధించారు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?