యూపీలో పెరుగుతున్న కేసులు.. తాజాగా మరో 817..

ఉత్తరప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో 817 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని..

  • Tv9 Telugu
  • Publish Date - 7:46 pm, Thu, 2 July 20

ఉత్తరప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో 817 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,869 యాక్టివ్ కేసులు న్నాయన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి 735 మంది మరణించినట్లు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 17,221 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గురువారం నాడు ఆరు లక్షల మార్క్‌ను దాటేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,26,947 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 3,59,860 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి పదిహేడు వేల మందికి పైగా మరణించారు.