Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

విజయవాడ కిడ్నాప్ కథ విషాదాంతం.. బాలిక హత్య!

-year-old girl kidnapped and murdered in Vijayawada, విజయవాడ కిడ్నాప్ కథ విషాదాంతం.. బాలిక హత్య!" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/11/VJA-Kid-Death.jpg 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/11/VJA-Kid-Death-300x180.jpg 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/11/VJA-Kid-Death-768x461.jpg 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/11/VJA-Kid-Death-600x360.jpg 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

విజయవాడ భవానీపురంలో బాలిక కిడ్నాప్ విషాదాంతమైంది. పక్కింట్లోనే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 8 ఏళ్ల బాలిక ద్వారక నానమ్మ ఇంటి దగ్గర ఆడుకునేందుకు వెళ్లి కనిపించకుండా పోయింది. బాలిక తప్పిపోయిన ప్రాంతంలో ఇతర రాష్ట్రాలకు చెందిన బ్యాచిలర్స్ ఎక్కువగా ఉంటున్నారు. వారిపైనే ద్వారకా తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే [పాలీసులు బాలిక ఇంటి  దగ్గరికి వచ్చారు. చుట్టూ నిర్మానుష్య ప్రదేశం ఉండటంతో డ్రోన్ సాయంతో పాప కోసం వెతికారు. బస్టాండ్ లో, రైల్వే స్టేషన్ లోను ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.  ఈ క్రమంలో బాలిక ఉంటున్న పక్కింట్లోనే మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవలే చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన మరువకముందే ఈ సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.