అమెరికాలో కరోనా విలయ తాండవం.. రికార్డు స్థాయిలో కేసులు నమోదు..

అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో అమెరికాదే..

అమెరికాలో కరోనా విలయ తాండవం.. రికార్డు స్థాయిలో కేసులు నమోదు..
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 10:10 AM

అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో అమెరికాదే అగ్రస్థానం. ఆ తర్వాత బ్రెజిల్, భారత్‌లు ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 76వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జాన్స్ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 76,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు అమెరికాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,69,991కి చేరింది. ఇక కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 1,225 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు అమెరికా వ్యాప్తంగా కరోనా బారినపడి ,147,333 మంది మరణించారు.