Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

దేశభక్తిని చాటిన తెలుగు సినిమాలు

Patriotic movies in Tollywood, దేశభక్తిని చాటిన తెలుగు సినిమాలు

ఆగష్టు 15.. తెల్లదొరల బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొంది భారతీయులను స్వత్రంత్ర్యం పొందిన గొప్ప రోజు. 1947లో మనకు స్వతంత్ర్యం రాగా.. ఈ సంవత్సరం 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇదిలా ఉంటే దేశభక్తిని తెలిపే ఎన్నో చిత్రాలు ఈ 73 ఏళ్లలో అన్ని భాషల్లో వచ్చాయి. ఇక టాలీవుడ్‌‌లోనూ పలు దేశభక్తి సినిమాలు వచ్చాయి. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్సార్, కృష్ణ.. ఆ తరువాత చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు తమ సినిమాల్లో దేశభక్తి అంశాలను తెలిపే కథలను ఎన్నుకున్నారు. అలా స్వాతంత్ర్య ప్రాముఖ్యతను, దేశం గొప్పతనాన్ని తెలిపిన కొన్ని సినిమాలు మీకోసం.

నా దేశం
ఎన్టీఆర్, జయసుధ, జమున కథానాయికలుగా 1982లో వచ్చిన మూవీ నా దేశం. యువ అనాథ చుట్టూ తిరిగే ఈ యాక్షన్ డ్రామాకు కె. బాపయ్య దర్శకత్వం వహించారు.

బొబ్బిలి పులి
1982లో ఎన్టీఆర్ ప్రధానపాత్రలో వచ్చిన చిత్రం బొబ్బలి పులి. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవీ, మురళీ మోహన్, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలలో నటించారు. దేశ భక్తి ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది.

సర్దార్ పాపారాయుడు
1980ల్లో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా కనిపించారు. సర్దార్ పాపారాయుడు అంటూ ఈ సినిమాలో ఎన్టీఆర్ పలికిన పలుకులను ఎవ్వరూ అంత సులభంగా మర్చిపోలేరు. శ్రీదేవీ, శారద తదితరులు నటించిన ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు.

అల్లూరి సీతారామరాజు
1974లో కృష్ణ ప్రధానపాత్రలో వచ్చిన చిత్రం అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అవార్డులు, రివార్డలను సాధించింది. అంతేకాదు కృష్ణ నటించిన 100వ చిత్రం ఇది కావడం విశేషం.

భారతీయుడు
1996లో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం మొదట తమిళ్‌ సినిమానే అయినప్పటికీ.. అక్కడ ఎంత విజయం సాధించిందో టాలీవుడ్‌లో డబ్ అయి ఇక్కడ అంతే సక్సెస్ అయింది. దేశంలో పెరిగిపోయిన లంచగొండితనాన్ని అరికట్టేందుకు ఓ భారతీయుడి పాత్రలో కమల్ చేసిన నటనను అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోరు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఖడ్గం:
వైవిధ్య దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ఖడ్గం. భారతదేశంలో హిందూ, ముస్లింల మధ్య స్నేహ బంధం.. దేశంలో జోలికొస్తే అందరం ఒకటవుతామంటూ తెలిపే సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కురిపించింది. ఇందులో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలలో కనిపించారు.

మహాత్మ:
శ్రీకాంత్ హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా మహాత్మ. ఒక వీధి రౌడీ గాంధీ మార్గంలో ప్రయాణించి ఎలా మంచి వాడయ్యాడు అనే అంశాన్ని కృష్ణవంశీ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో రెండో దేశభక్తి సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు కృష్ణవంశీ.

ఇక వీటితో పాటు వందేమాతరం, స్టాలిన్, ఠాగూర్, ఘాజీ, కొమరం పులి, సుభాష్ చంద్రబోస్, పరమవీర చక్ర, మేజర్ చంద్రకాంత్, ఆంధ్ర కేసరి, జై, నేటి భారతం వంటి తెలుగు చిత్రాలు దేశభక్తిని చాటాయి. అంతేకాదు ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల కాబోతున్న చిరు చిత్రం సైరా నరసింహారెడ్డి.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ కూడా దేశభక్తిని చాటి చెప్పే సినిమాలే.