Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజేంద్రనగర్ గ్రే హౌండ్స్ ప్రాంతంలో మళ్లీ చిరుత తిరుగుతూ సిసి కెమెరాకు చిక్కిన ఆనవాళ్లు. గ్రే హౌండ్స్ కాంపౌండ్ లోపల ఉన్నట్టు గుర్తింపు. 700ఎకరాల్లో పోలీస్ గ్రే హౌండ్స్ . గ్రే హౌండ్స్ ఉన్నతాధికారుల నుండి అనుమతి వచ్చిన తర్వాతే బొన్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్న అటవీశాఖ అధికారులు. గ్రే హౌండ్స్ చుట్టూ జూ సిబ్బంది, షూటర్స్, ట్రాప్ కెమెరా లతో అప్రమత్తం.
  • రెండు రాష్ట్రా ప్రభుత్వాలకు ఈనెల 4న జరిగే కృష్ణా నది యజమాన్య బోర్డు మీటింగ్ ఏజెండాలను పంపిన కృష్ణా నీటీ యాజమాన్య బోర్డ్. ఏజెండాలో ప్రధానంగా 5 అంశాల ప్రస్తావన. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టు లు , అభ్యంతరాలు , ప్రాజెక్టుల డీపీఆర్ లు.
  • టిటిడి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన. టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.
  • తూ. గో.జిల్లా: కోనసీమలో కరోన కలకలం. కోనసీమను గజ గజ లాడిస్తున్న ..ముంబై నుంచి వచ్చిన వలస కూలీలు . ఈరోజు ఒక్కరోజులో 28 కరోన పోసిటివ్ కేసులు నమోదు.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

పీవీ సింధును పెళ్ళాడతా.. లేదా కిడ్నాప్ చేస్తా.. 70 ఏళ్ళ ముసలి వగ్గు వింత కోర్కె..

A 70-year-old man has claimed that he is only 16-year-old and wants to marry badminton star PV Sindhu, పీవీ సింధును పెళ్ళాడతా.. లేదా కిడ్నాప్ చేస్తా.. 70 ఏళ్ళ ముసలి వగ్గు వింత కోర్కె..

ఇది సీరియస్ విషయమో, లేదా తమాషా జోక్ ఏమో గానీ తమిళనాడులో 70 ఏళ్ళ ముసలివగ్గు ఒకరు తాను బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును పెళ్లాడతానంటున్నాడు. రామనాథపురం జిల్లాకు చెందిన మలైసామి అనే ఈయన.. ఇలా తన వింత కోర్కెను బయటపెట్టాడు. సింధును వివాహం చేసుకుంటానని, అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేస్తానని హెచ్ఛరిస్తున్నాడు. జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజాదర్బార్ లో మలైసామి ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని ఆయనకు సమర్పించాడు. (సాధారణంగా ప్రతి వారం ఆ జిల్లాలో ఇలాంటి ప్రజాదర్బార్ లను కలెక్టరేట్ లో నిర్వహిస్తుంటారు. ఆ సందర్భంగా ప్రజలనుంచి అందే విజ్ఞప్తులను స్వీకరిస్తుంటారు). పీవీ సింధు ఫొటోతోను, తన ఫొటోతోను కూడిన లేఖను ఈ ముసలాయన అందజేశాడు. పైగా తాను 2004 ఏప్రిల్ 4 న పుట్టానని, తన వయస్సు
16 ఏళ్ళేనని కూడా అందులో మలైసామి పేర్కొన్నాడు. 24 ఏళ్ళ సింధు బ్యాడ్మింటన్ కెరీర్ ఎలా ఎదిగిపోతోందో చూసి తను ఎంతో ఇంప్రెస్ అయ్యానని, ఇక ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకోవాలన్నదే తన ఆశయమని అంటున్నాడు. ఈ ముసలి వగ్గు విష్ విని అంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. సింధుకి ఈ విషయం తెలిసి పడీపడీ నవ్వుకుంటుందేమో చూడాలి !

Related Tags