నిద్రిస్తున్న చిన్నారులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..

కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం ఎలగందల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు చెట్టుకింద నిద్రిస్తున్న చిన్నారులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లగా.. ఈ ఘటనలో లక్ష్మీబాయి(7) మృతి చెందగా, రాము(7) తీవ్రంగా గాయపడ్డాడు. యల్లప్ప, కమలవ్వ దంపతులు జీవనం సాగించుకుంటూ అక్కడే ఓ ఇంట్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కవలపిల్లలు. ఇసుక నింపేందుకని అక్కడే ఉన్న ట్రాక్టర్‌ రివర్స్ చేస్తుండగా ఈ ఘటన నెలకొంది. దీంతో.. చిన్నారుల ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *