తాజ్‌మహాల్‌ పరిసరాల్లో ఏడడుగుల కొండచిలువ

ప్రేమ బంధానికి చిహ్నమైన తాజ్‌మహాల్‌ ను చూసేందుకు ఓ కొండ చిలువ నేను సైతం వచ్చేసింది. సరదా అనిపించినా.. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో విష సర్పాలు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా ఆగ్రాలోని తాజ్‌మహాల్‌ పరిసరాల్లో కొండ చిలువ కలకలం సృష్టించింది.

తాజ్‌మహాల్‌ పరిసరాల్లో ఏడడుగుల కొండచిలువ
Follow us

|

Updated on: Aug 18, 2020 | 7:48 PM

ప్రేమ బంధానికి చిహ్నమైన తాజ్‌మహాల్‌ ను చూసేందుకు ఓ కొండ చిలువ నేను సైతం వచ్చేసింది. సరదా అనిపించినా.. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో విష సర్పాలు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా ఆగ్రాలోని తాజ్‌మహాల్‌ పరిసరాల్లో కొండ చిలువ కలకలం సృష్టించింది.

లాక్‌డౌన్‌లో భాగంగా చారిత్రక కట్టడం తాజ్‌మహాల్‌ను మూసివేయడంతో, సందర్శకులు లేక వెలవెలబోతోంది. జనం లేకపోవడంతో 7 అడుగుల పొడవైన కొండ చిలువ సోమవారం సాయంత్రం తాజ్‌మహాల్‌ ప్రాంగణంలో సంచరిస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది గమనించి వైల్డ్‌ లైఫ్‌ ఎస్‌ఓఎస్‌ బృందానికి సమాచారం అందించారు. వెంటనే రిస్క్యూ టీం అక్కడికి చేరుకుని దాన్ని పట్టుకొని అడవిలో వదిలేశారు. ఇది పశ్చిమ భాగంలో ఉన్న తాజ్ మ్యూజియం వెలుపల కనిపించినట్లు అధికారుల తెలిపారు. భద్రతా సిబ్బంది సహకారంతో పామును గుర్తించడంతో పెను ముప్పు తప్పిందన్నారు.