పొలాల్లో మొసలి కలకలం.. మేకల్ని, ఆవుల్ని తింటూ..

గుజరాత్‌ రాష్ట్రంలో ఓ మొసలి గ్రామస్థుల్ని భయబ్రాంతులకు గురిచేసింది. వడోదర జిల్లాలోని మువాడా గ్రామంలోని పోలాల్లో గత రెండు రోజులుగా ఓ మొసలి కలకలం రేపుతోందని గ్రామస్ధులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

పొలాల్లో మొసలి కలకలం.. మేకల్ని, ఆవుల్ని తింటూ..
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2020 | 9:06 PM

గుజరాత్‌ రాష్ట్రంలో ఓ మొసలి గ్రామస్థుల్ని భయబ్రాంతులకు గురిచేసింది. వడోదర జిల్లాలోని మువాడా గ్రామంలోని పోలాల్లో గత రెండు రోజులుగా ఓ మొసలి కలకలం రేపుతోందని గ్రామస్ధులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ గ్రామ పొలాల్లో ఓ మొసలి తిరుగుతోందని.. మేకల్ని, ఆవుల్ని తినేస్తోందంటూ అధికారులకు తెలిపారు. అయితే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు మొసలి కదలికల్ని ట్రేస్ చేశారు. దీంతో మొసలిని పట్టుకునేందుకు ఓ ఉచ్చును ఏర్పాటు చేశారు. అందులో ఓ జంతువుని పెట్టి.. దాన్ని ఆ ఉచ్చులో పడేలా ప్రయత్నించారు. అయితే రెండు రోజులు ప్రయత్నించినప్పటికీ ఆ మొసలి ఆ ఉచ్చులో పడలేదు. అయితే మూడో రోజు మరోసారి ప్రయత్నించగా.. ఉచ్చులో చిక్కింది. దీంతో గ్రామస్ధులు అధికారులకు సమాచారాన్ని అందజేయడంతో.. అధికారులు అక్కడి చేరుకుని ఆ మొసలిని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఏడు అడుగులు పొడవు ఉందని తెలిపారు.