భారత్‌లో 62కి చేరిన కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలో తొలి మరణం?

కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 62కి చేరుకుంది. బుధవారం (మార్చి 11) ఢిల్లీలో ఒకటి, రాజస్థాన్‌లో మరొకటి కొత్త కేసులు

భారత్‌లో 62కి చేరిన కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలో తొలి మరణం?
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2020 | 7:40 PM

కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 62కి చేరుకుంది. బుధవారం (మార్చి 11) ఢిల్లీలో ఒకటి, రాజస్థాన్‌లో మరొకటి కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 62కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో కరోనా కేసుల సంఖ్య 17కి చేరుకుంది. రాజస్థాన్‌లోనూ కరోనా బారినపడ్డ వారి సంఖ్య 17కి పెరిగింది. అయితే.. రాజస్థాన్‌లో కరోనా బారిన పడ్డ వారిలో 16 మంది విదేశీయులే (ఇటలీ) కావడం గమనార్హం.

కాగా.. కోవిద్ 19 వైరస్ అనుమానిత లక్షణాలతో కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడు (76) మృతి చెందాడు. కలబుర్గికి చెందిన ఇతడు ఫిబ్రవరి 29న సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయణ్ని గుల్‌బర్గా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించగా.. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. అయితే.. ఆయన కరోనా వైరస్ కారణంగానే మృతి చెందారా అనేది నిర్ధారించాల్సి ఉంది. కరోనా వల్లే మృతి చెందితే భారత్‌లో తొలి కరోనా మృతి అవుతుంది.

Also Read : జనసేన అభ్యర్థిగా.. స్థానిక బరిలో.. 70 ఏళ్ల వృద్ధురాలు..!