భారీ వర్షాలకు తడిసిన సిక్కిం.. ఇక్కట్లలో టూరిస్టులు

Torrential rain in North Sikkim, భారీ వర్షాలకు తడిసిన సిక్కిం..  ఇక్కట్లలో టూరిస్టులు

నార్త్ సిక్కింలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షం కారణంగా జీమా ప్రాంతంలో దాదాపు 60 టూరిస్టు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పర్యాటకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్థుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

గతవారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు చాలా వరకు పర్యాటక వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పర్యాటకులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు తీసుకెళ్లాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. వీలైనంత త్వరగా రహదారులు క్లియర్ చేయాలని సూచించారు. వర్ష ప్రభావిత పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులను అనుమతించట్లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *