ఓహియో, ఎల్‌పాసో మరువకముందే..ఫిలడెల్ఫియాలో..

US cops injured in shooting by gunman, ఓహియో, ఎల్‌పాసో మరువకముందే..ఫిలడెల్ఫియాలో.." srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/08/us-firing.jpg 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/08/us-firing-300x180.jpg 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/08/us-firing-768x461.jpg 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/08/us-firing-600x360.jpg 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓహియో, ఎల్‌పాసో ఘటనలు మరువకముందే..ఫిలడెల్ఫియాలో కాల్పులకు తెగబడ్డాడు ఓ ఆగంతకుడు. డ్రగ్స్‌ సరఫరా కేసులో నిందితుడు మారిస్‌ హిల్‌.. టియోగా నికెటౌన్‌లోని ఓ ఇంట్లో ఉన్నాడన్న పక్కా సమాచారంతో.. పోలీసులు ఆ పరిసరాలను చుట్టుముట్టారు. అయితే అది గమనించిన ఆ దుండగుడు పోలీసులపై కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఆరుగురు పోలీస్‌ అధికారులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే దుండగుడితో 7 గంటలకు పైగా కాల్పులు కొనసాగాయి. అనంతరం మారిస్‌ హిల్‌ పోలీసులకు లొంగిపోయాడు. గత 30 ఏళ్ల కాలంలో ఇలాంటి ఘటన జరగలేదని..ఇంతమంది పోలీసులు ఎప్పుడూ గాయపడలేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనలో పోలీసుల తీరును ప్రశంసించారు మేయర్‌ కెన్నీ. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *