హైదరాబాద్‌తో సహా.. హైస్పీడ్ రైల్వే కోసం 6 కారిడార్ల గుర్తింపు..

ఇక గంటకు మూడు వందల కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే హైస్పీడ్ ట్రైన్లు దేశ వ్యాప్తంగా ఆరు కారిడార్లలో పరుగెత్తనున్నాయి. ఇందులో హైదరాబాద్ నగరం కూడా ఉంది. ఇందుకుగాను దేశ వ్యాప్తంగా ఆరు కారిడార్లను రైల్వే శాఖ గుర్తించింది. వీటిలో హైస్పీడ్‌, సెమీ హైస్పీడ్‌ కారిడార్లుగా.. ఆరు సెక్షన్లను గుర్తించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. ఈ కారిడార్లకు సంబంధించి.. పూర్తిస్థాయి నివేదికను ఏడాదిలోపు రూపొందిస్తామని తెలిపారు. ఈ హైస్పీడ్‌ కారిడార్‌లో రైళ్లు గంటకు […]

హైదరాబాద్‌తో సహా.. హైస్పీడ్ రైల్వే కోసం 6 కారిడార్ల గుర్తింపు..
Follow us

| Edited By:

Updated on: Jan 30, 2020 | 9:16 AM

ఇక గంటకు మూడు వందల కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే హైస్పీడ్ ట్రైన్లు దేశ వ్యాప్తంగా ఆరు కారిడార్లలో పరుగెత్తనున్నాయి. ఇందులో హైదరాబాద్ నగరం కూడా ఉంది. ఇందుకుగాను దేశ వ్యాప్తంగా ఆరు కారిడార్లను రైల్వే శాఖ గుర్తించింది. వీటిలో హైస్పీడ్‌, సెమీ హైస్పీడ్‌ కారిడార్లుగా.. ఆరు సెక్షన్లను గుర్తించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. ఈ కారిడార్లకు సంబంధించి.. పూర్తిస్థాయి నివేదికను ఏడాదిలోపు రూపొందిస్తామని తెలిపారు. ఈ హైస్పీడ్‌ కారిడార్‌లో రైళ్లు గంటకు 300 కి.మీ.ల వేగంతో నడుస్తాయని.. అదే విధంగా సెమీ హైస్పీడ్‌ కారిడార్‌లో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయని తెలిపారు. దీనికి సంబంధించి కావాల్సిన స్థల సేకరణ, అలైన్‌మెంట్‌ వంటి అంశాల ఆధారంగా.. ఎంతవరకు సాధ్యమవుతుందన్నదానిపై డీపీఆర్‌ రూపకల్పన చేస్తామని వివరించారు. ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ తొలి హైస్పీడ్‌ కారిడార్‌గా గుర్తించారు. ఈ మార్గంలో.. 2023 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుందని తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి.. దాదాపు తొంభై శాతం స్థల సేకరణ పూర్తవుతుదంని.. మొత్తంగా 1,380 హెక్టర్లు ఇందుకోసం అవసరమవుతుందని తెలిపారు.

గుర్తించిన ఆరు కారిడార్లు ఇవే.. 1. ఢిల్లీ-నోయిడా-ఆగ్రా-లక్నో-వారణాశి (865 కి.మీ.) 2. ఢిల్లీ-జయ్‌పూర్‌-ఉదయ్‌పూర్‌-అహ్మదాబాద్‌ (886 కి.మీ) 3. ముంబయి-నాసిక్‌-నాగ్‌పూర్ (753 కి.మీ) 4. ముంబయి-పుణె-హైదరాబాద్‌ (711 కి.మీ) 5. చెన్నై-బెంగళూరు-మైసూరు (435 కి.మీ) 6. ఢిల్లీ-చండీగఢ్‌-లుథియానా-జలంధర్‌-అమృతసర్‌ (459కి.మీ)

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్