Uppena Movie Teaser : అందమైన ప్రేమ కథగా రానున్న ఉప్పెన.. రికార్డ్ క్రియేట్ చేసిన టీజర్..

మెగా కాంపౌండ్ నుంచి మస్తున్న మరో హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఈ యంగ్ హీరో ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు.ఇప్ప‌టికే ఈ మూవీలోని పాట‌లు మిలియ‌న్ల సంఖ్య‌లో వ్యూస్ సాధించాయి..

Uppena Movie Teaser : అందమైన ప్రేమ కథగా రానున్న ఉప్పెన.. రికార్డ్ క్రియేట్ చేసిన టీజర్..
Follow us

|

Updated on: Jan 17, 2021 | 2:11 PM

Uppena Movie Teaser : మెగా కాంపౌండ్ నుంచి మస్తున్న మరో హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఈ యంగ్ హీరో ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. తమిళ ప్రముఖ కథానాయకుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నారు.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్ప‌టికే ఈ మూవీలోని పాట‌లు మిలియ‌న్ల సంఖ్య‌లో వ్యూస్ సాధించాయి. ఇప్పుడు టీజర్ కూడా రికార్డ్ లను క్రియేట్ చేస్తుంది. ఈ టీజర్ నాలుగు రోజుల్లోనే 6 మిలియ‌న్ల వ్యూస్ సాధించ‌గా..2,50, 000 లైక్స్ వ‌చ్చాయి. ఈ టీజర్ పై మెగా హీరోలు కూడా స్పందించారు. రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా చిత్రయూనిట్ కు విషెస్ తెలిపారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఓ ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగిస్తుంది.