వరుస మరణాలతో వణికిపోతున్న ముప్పనపల్లి.. కారణం ఏంటో తెలియక భయంతో గ్రామస్థులు ఏం చేస్తున్నారంటే?

ఆ గ్రామంలో వరుసగా ఒకరి తర్వాత ఒకరు మృతిచెందుతుండటంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఎందుకు చనిపోతున్నారో కారణం

వరుస మరణాలతో వణికిపోతున్న ముప్పనపల్లి.. కారణం ఏంటో తెలియక భయంతో గ్రామస్థులు ఏం చేస్తున్నారంటే?
Follow us

|

Updated on: Dec 28, 2020 | 11:50 AM

ఆ గ్రామంలో వరుసగా ఒకరి తర్వాత ఒకరు మృతిచెందుతుండటంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఎందుకు చనిపోతున్నారో కారణం తెలియక తండ్లాడుతున్నారు. 20 రోజుల్లోనే ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఏదైనా దుష్ట శక్తియా, లేదంటే వింత వ్యాధియా తెలియక గ్రామస్థులందరు బెంబేలెత్తిపోతున్నారు. భయంతో ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోతున్నారు. వరంగల్ జిల్లాలోని ఓ కుగ్రామంలో చెలరేగుతున్న మరణాలకు కారణం ఏమై ఉంటుంది.

ఏటూరునాగారం ఏజెన్సీలోని ఓ మారుమూల గ్రామం ముప్పనపల్లి. ఈ గ్రామం 20 రోజులుగా మృత్యు భయంతో బెంబేలెత్తిపోతోంది. ఈ ఊరిలో ఏ ఒక్కరికి కంటిమీద కునుకు లేదు. ఏ ఇంట్లో అలికిడి అయినా ఏదో జరిగిపోతుందనే ఆందోళన వెంటాడుతోంది. కడుపునొప్పి జ్వరంవస్తే చాలు. ఇక చావు తప్పదని ఆందోళన చెందుతున్నారు. 20 రోజుల్లో గ్రామానికి చెందిన ఎర్రయ్య, లక్ష్మీనారాయణ, కుమారి, దుర్గమ్మ, రాధిక, రమేష్‌ అనే వ్యక్తులు చనిపోయారు. వాళ్లకు కడుపునొప్పి వచ్చిన కొద్దిసేపటికే కడుపంతా ఉబ్బి రక్తంతో వాంతులు చేసుకొని కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు.

ముప్పనపల్లిలో మృత్యుఘోషపై ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. గ్రామంలో ప్రత్యేక హెల్త్ క్యాంపు నిర్వహించారు. చనిపోయిన వారితోపాటు ప్రస్తుతం బ్రతికి ఉన్నవారి కుటుంబ సభ్యులకు మలేరియా, కరోనా, డెంగ్యూ, టైపాయిడ్ టెస్టులు నిర్వహించారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. ఈ చావులకు కారణ మేమిటో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అంతు చిక్కడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే మకాం వేసి మరోచావు ఊరిపోలిమెరల్లోకి కూడా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కచ్చితంగా ఎదో శక్తి ఆవహించిందని, చేతబడి చేశారని గ్రామమంతా ఆందోళన చెందుతుండడంతో వేద పండితులతో భారీ హోమం నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకూ ముప్పెనపల్లిలో చనిపోయిన వారి మరణాలకు కారణాలు తెలియదు. ఎప్పుడు ఎవరు బలవుతారో అర్థంకాక వీరంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భీతిల్లుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ మరణాలకు కారణాలు అన్వేషించి, మరో మరణం జరగకుండా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..