ఆ మూక దాడి నిందితులంతా నిర్దోషులే..

Rajasthan Case

అళ్వార్ మూక దాడి కేసులో నిందితులుగా ఉన్న ఆరుగుర్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మూకదాడి ఘటన.. రాజస్థాన్ రాష్ట్రంలో 2017లో జరిగింది. అప్పట్లో ఈ సంఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పెహ్లూ ఖాన్‌ అనే వ్యక్తి మరొక ఆరుగురితో కలిసి కొన్ని ఆవులను జైపూర్ నుంచి హర్యానాకు వ్యానులో తీసుకెళ్తున్నపుడు ఈ సంఘటన జరిగింది. పెహ్లూ ఖాన్ బృందంపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన ఖాన్‌ను ఆసుపత్రిలో చేర్పించి. చికిత్స చేయించారు. కానీ మూడు రోజుల తర్వాత ఆయన తుది శ్వాస విడిచారు. కొందరు దుండగులు పెహ్లూ ఖాన్‌ను కొడుతున్నట్లు చూపే వీడియో వైరల్ అయింది. అయితే ఈ వీడియో ఆధారంగా పోలీసులు తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. వీరికి గతంలోనే బెయిలు మంజూరైంది. తాజాగా సరైన ఆధారాలు లేకపోవడంతో.. నిందితులంతా నిర్దోషులేనంటూ కోర్టు తీర్పు నిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *