బ్రేకింగ్: ఇండో-పాక్ సరిహద్దులో మళ్ళీ భూకంపం

భారత్-పాకిస్తాన్ సరిహద్దు మరోసారి పెను భూకంపంతో వణికిపోయింది. గురువారం మధ్యాహ్నం గం.12 : 31 ని.లకు భూకంపం సంభవించింది. దాంతో జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత 4 .8 మాగ్నిట్యూడ్ గా నమోదైంది. రెండ్రోజుల క్రితం వచ్చిన భూకంప తీవ్రతతో పాక్ ఆక్రమిత కశ్మీర్ వణికిపోగా తాజా భూకంపం మరోసారి ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. మంగళ వారం సంభవించిన భూకంపంలో ఇప్పటికి వరకు 33 మంది మరణించినట్టు సమాచారం. అయితే […]

బ్రేకింగ్: ఇండో-పాక్ సరిహద్దులో మళ్ళీ భూకంపం
Follow us

| Edited By:

Updated on: Sep 26, 2019 | 4:48 PM

భారత్-పాకిస్తాన్ సరిహద్దు మరోసారి పెను భూకంపంతో వణికిపోయింది. గురువారం మధ్యాహ్నం గం.12 : 31 ని.లకు భూకంపం సంభవించింది. దాంతో జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత 4 .8 మాగ్నిట్యూడ్ గా నమోదైంది. రెండ్రోజుల క్రితం వచ్చిన భూకంప తీవ్రతతో పాక్ ఆక్రమిత కశ్మీర్ వణికిపోగా తాజా భూకంపం మరోసారి ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. మంగళ వారం సంభవించిన భూకంపంలో ఇప్పటికి వరకు 33 మంది మరణించినట్టు సమాచారం. అయితే తాజా భూకంప తీవ్రత పెద్దగా లేకపోవడంతో పెద్దగా ఆస్తి నష్టం జరిగిన సమాచారమేమి ప్రస్తుతానికి లేదు.