ఐదో తరంలోకి వెళ్లబోతున్నామా?

మనం చూస్తుండగానే 5జీ టెక్నాలజీలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏటికేడాది ఇంటర్‌నెట్ స్పీడుకు సంబంధించిన పరిణామాలు అత్యంతవేగంగా మారిపోతున్నాయి. సాధారణ ప్రజానీకానికి 3జీ,4జీ,5జీ అంటే తెలియకపోవచ్చు. కానీ వారు ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ విషయం వచ్చేసరికి మాత్రం ఈ పేర్లు ఖచ్చితంగా పలకడం సామాన్యంగా మారిపోయింది. గత రెండేళ్ల క్రితం 2జీ టెక్నాలజీతో ఫోన్లు పనిచేసేవి. ఆతర్వాత 3జీ వచ్చేసింది. అది కంటిన్యూ అవుతుండగానే 4జీ కూడా అందుబాటులోకి వచ్చింది. సాంకేతిక పరిఙ్ఞానం విస్తృతి పెరిగేకొద్దీ ప్రజలు కూడా దాన్ని వినియోగించుకోడానికి […]

ఐదో తరంలోకి వెళ్లబోతున్నామా?
Follow us

| Edited By:

Updated on: Jun 26, 2019 | 5:40 PM

మనం చూస్తుండగానే 5జీ టెక్నాలజీలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏటికేడాది ఇంటర్‌నెట్ స్పీడుకు సంబంధించిన పరిణామాలు అత్యంతవేగంగా మారిపోతున్నాయి. సాధారణ ప్రజానీకానికి 3జీ,4జీ,5జీ అంటే తెలియకపోవచ్చు. కానీ వారు ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ విషయం వచ్చేసరికి మాత్రం ఈ పేర్లు ఖచ్చితంగా పలకడం సామాన్యంగా మారిపోయింది. గత రెండేళ్ల క్రితం 2జీ టెక్నాలజీతో ఫోన్లు పనిచేసేవి. ఆతర్వాత 3జీ వచ్చేసింది. అది కంటిన్యూ అవుతుండగానే 4జీ కూడా అందుబాటులోకి వచ్చింది. సాంకేతిక పరిఙ్ఞానం విస్తృతి పెరిగేకొద్దీ ప్రజలు కూడా దాన్ని వినియోగించుకోడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ప్రస్తుతం ఉన్న 4జీ స్ధానంలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా మనం వాడుతున్న మొబైల్ ఫోన్లు మరింత వేగంగా పనిచేసే అవకాశాలున్నాయంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఈ టెక్నాలజీతో జనం మరింత స్మార్ట్‌గా మారిపోయే అవకాశాలున్నాయట. మన ఊహకు అందని ఎన్నో గొప్ప అనుభవాల్ని ఈ టెక్నాలజీతో చూడబోతున్నామంటున్నారు. అయితే ఇప్పటికే చాల విషయాల్లో స్మార్ట్‌ఫోన్ సహకారం తప్పనిసరి. ఇక 5జీ కూడా అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో మరిన్ని మార్పులు కూడా చూసే వీలుందట.

ఇప్పటికే 4జీ టెక్నాలజీ సాయంతో ఎన్నో అద్భుతాలు చేయగలుగుతున్నారు . రాబోయే 5జీతో అగ్నిప్రమాదాలు,ట్రాఫిక్ పర్యవేక్షణ వంటివి సులువుగా గుర్తించే వీలుందట. అదేవిధంగా మానవ రహిత వాహనాలు రోడ్లెక్కే అవకాశాలు కూడా ఉన్నాయట. మనం ప్రస్తుతం 4జీ టెక్నాలజీ వినియోగిస్తూ సమయానికి నెట్ అందుబాటులో లేకపోవడంతోనో, లేక అనుకున్నంత స్పీడు లేకపోవడంతోనో తీవ్ర అసహనానికి గురవుతాం. అయితే ఈసమస్యకు పరిష్కారంగా 5జీ నిలుస్తుందట. స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్నా, వైఫై స్పీడుకోసం చూస్తున్నా దాని స్పీడు తగ్గిపోయే పరిస్థితి ఉండబోదట. అనుకున్న వీడియో వెంటనే డౌన్‌లోడ్ కావడం లేక ప్లే కావడం ఈజీగా జరిగిపోయే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ‘‘ ఎంతో ఆసక్తి కలిగిస్తున్న ఈ 5జీ టెక్నాలజీని 2020 నాటికి అంటే మరో ఏడాది కాలంలో అందుబాటులోకి తెచ్చేలా భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది. 3జీ,4జీ ప్రారంభంలో ఎదురైన సమస్యల వంటివాటికి చెక్ పెట్టి వీలైనంత త్వరగా ప్రపంచం దేశాలతో సమానంగానే ఈసేవల్ని అందుబాటులోకి తెచ్చేలా క‌ృషిచేస్తోంది భారత ప్రభుత్వం.