బోనాలకు గోల్కొండ ముస్తాబు.. ఒక్కరోజులోనే 56 టన్నుల చెత్త తరలింపు

తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని.. గోల్కొండ కోటలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం సిబ్బంది, అధికారులు తొలగించారు. మొత్తం 30 మంది పారిశుధ్య కార్మికులతో పాటు జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్‌కి చెందిన ఒక సూపర్ వైజర్, ముగ్గురు శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్స్ సోమవారం ఉదయం గోల్కొండ కోటలో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు మొదలుపెట్టారు. అయితే బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. వారంలో […]

బోనాలకు గోల్కొండ ముస్తాబు.. ఒక్కరోజులోనే 56 టన్నుల చెత్త తరలింపు
Follow us

|

Updated on: Jul 16, 2019 | 11:43 AM

తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని.. గోల్కొండ కోటలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం సిబ్బంది, అధికారులు తొలగించారు. మొత్తం 30 మంది పారిశుధ్య కార్మికులతో పాటు జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్‌కి చెందిన ఒక సూపర్ వైజర్, ముగ్గురు శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్స్ సోమవారం ఉదయం గోల్కొండ కోటలో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు మొదలుపెట్టారు.

అయితే బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. వారంలో మూడు రోజులు బోనాల పండుగ జరుగుతుందని.. అయితే ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తున్నప్పటికీ రోజువారీగా పేరుకుపోతుందని.. ఉత్సవాల్లో ప్రత్యేకంగా మూడు వారాలు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి చెత్తను తొలగిస్తున్నామని జీహెచ్ఎంసీకి చెందిన ఓ అధికారి తెలిపారు. అవసరమైన చోట బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లిస్తున్నామని వివరించారు. గోల్కొండ కోటను శుభ్రం చేసే పనిలో ఒక్క రోజులోనే 56 టన్నుల చెత్తను కోటలోనుంచి తొలగించామని చెప్పారు. కాగా, మంగళవారం సాయంత్రానికి కోటలోని కట్టడాల మధ్య పేరుకుపోయిన చెత్తను పూర్తిస్థాయిలో తొలగిస్తామని తెలిపారు. అయితే చారిత్రక కట్టడాల మధ్య చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడంలో పారిశుధ్య విభాగం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కేంద్రపురావస్తుశాఖ గోల్కొండ నిర్వహణ అధికారులు వాపోతున్నారు.