కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించి క్రికెట్ మ్యాచ్.. 51మందిపై కేసు..!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొందరు ఆకతాయిలు

  • Tv9 Telugu
  • Publish Date - 4:42 am, Sun, 5 July 20

Cricket match in Greater Noida: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొందరు ఆకతాయిలు క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన మ్యాచ్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు అక్కడ ఉన్న 51మందిపై కేసు నమోదు చేశారు. అలాగే గ్రౌండ్‌కు రావడానికి వారు ఉపయోగించిన 17 కార్లకు చలానా విధించారు.

Also Read: యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్డిసివిర్ డోసేజ్‌లో మార్పులు: కేంద్రం