తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌తో ట్రెండీగా..!

000mah Battery and Few Features Confirmed in Realme 5 Series, తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌తో ట్రెండీగా..!" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/08/REAL-ME-brand-new-smart-pho.png 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/08/REAL-ME-brand-new-smart-pho-300x180.png 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/08/REAL-ME-brand-new-smart-pho-768x461.png 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/08/REAL-ME-brand-new-smart-pho-600x360.png 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

మొబైల్‌ ఫోన్స్‌.. టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే.. ఉంటాయి. ‘తొందర పడి ఏ పనీ చేయకూడదు’ అనే.. సామెత ఫోన్స్ కొనే విషయంలో చక్కగా పనికొస్తుందనే చెప్పాలి. ఎందుకంటే.. ఎప్పటికప్పుడు ఫోన్స్‌లలొ కొత్త కొత్త ఫీచర్స్, టెక్నాలజీలు వస్తూనే ఉన్నాయి. ఇక ఆఫర్ల విషయంలో.. చెప్పనవసరం లేదు.. మా ఫోన్‌ కొంటే.. ఇవి ఫ్రీ అంటూ.. వినియోగదారులను ఆకట్టుకునేలా పలు సంస్థలు ప్రకటనలు కూడా చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సంస్థ మార్కెట్‌లో.. 1, 2, 3 సిరీస్‌లను లాంచ్‌ చేసింది. కాగా.. ఇప్పుడు 4 కాకుండా డైరెక్ట్‌గా 5 సిరీస్‌ను లాంచ్ చేస్తుంది.

కాగా.. ఇప్పుడు రియల్‌మీ సరికొత్త స్మార్ట్‌ ఫోన్ మార్కెట్‌లో సందడి చేస్తోంది. ఈ మధ్యనే ఈ ఫోన్ టీజర్‌ లాంచ్ చేసింది సంస్థ. దీంతో.. వినియోగదారులు ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. అతి తక్కువ ధరలోనే..ఎక్కువ ఫీచర్స్ దీని సొంతం. అయితే.. ఆగష్టు 20న ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్టు ఈ సంస్థ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. మరి ఆ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందామా..!

1. ఈ ఫోన్‌కు నాలుగు కెమెరాలు
2. ఇండియాలోనే తొలిసారిగా.. 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా
3. రూ.10 వేల ధర లోపు
4. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
5. డిస్‌ప్లే: 6.53 అంగుళాలు
6. ర్యామ్: 3 జీబీ, 4జీబీ
7. ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 665

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *