లక్ష్మిని తెచ్చిపెట్టే నక్షత్ర తాబేళ్ల.. అక్రమ రవాణా..!

00 indian star tortoises being smuggled train rescued vijayawada station, లక్ష్మిని తెచ్చిపెట్టే నక్షత్ర తాబేళ్ల.. అక్రమ రవాణా..!" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/07/STAR-TOORTISE.png 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/07/STAR-TOORTISE-300x180.png 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/07/STAR-TOORTISE-768x461.png 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/07/STAR-TOORTISE-600x360.png 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

అరుదైన నక్షత్ర తాబేళ్లకు ముప్పొచ్చిపడింది. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ తాబేళ్లను స్మగ్లర్లు గాలమేస్తున్నారు. అక్రమంగా ఖండాంతరాలకు తరలిస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో వల పన్ని పట్టుకున్నారు డీఆర్‌వో అధికారులు.

నక్షత్ర తాబేళ్లు ఓ అరుదైన జాతి. ఈ తాబేళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవులు, కొండల్లో ఎక్కువగా కనిపిస్తూంటాయి. ప్రకాశం జిల్లాలోని కనిగిరి, పామూరు, దర్శి కొండల్లో నక్షత్ర తాబేళ్లకు ఆవాస యోగ్యమైన ప్రదేశం. ఈ తాబేళ్లకు ఉన్న విశిష్టతే ఉనికికి ముప్పు తెచ్చి పెట్టింది. నక్షత్ర తాబేళ్ల మాంసం, రక్తం ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారనే ప్రచారం.. బాగా సాగుతోంది. అంతేకాదు.. ఇవి గృహ వాస్తుకు ఉపకరిస్తాయనే నమ్మకాలు ఉండటంతో నక్షత్ర తాబేళ్లను స్మగ్లింగ్ మాఫియా టార్గెట్ చేసింది.

ఒక్కో తాబేలు లోక‌ల్‌గా రూ.300 నుంచి మూడు వేల దాకా చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. చిన్నసైజులో ఉండే తాబేళ్లు రవాణాకు కూడా అనుకూలంగా ఉండటంతో ఈజీగా దేశ సరిహద్దులు దాటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *