అదనపు రుణాలకు అనుమతి… ఐదు రాష్ట్రాలకు ఆమోదం తెలిపిన కేంద్ర సర్కారు… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు అవకాశం…

అదనపు రుణాలు తీసుకునేందుకు ఐదు రాష్ట్రాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణల ఫలితంగా అధిక రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.

అదనపు రుణాలకు అనుమతి... ఐదు రాష్ట్రాలకు ఆమోదం తెలిపిన కేంద్ర సర్కారు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు అవకాశం...
Follow us

| Edited By:

Updated on: Dec 20, 2020 | 2:16 PM

అదనపు రుణాలు తీసుకునేందుకు ఐదు రాష్ట్రాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణల కారణంగా అధిక రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి రూ.2,508కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కి రూ.2,525 కోట్ల అదనపు రుణాలు పొందేందుకు వెలుసుబాటు ఇచ్చింది. సులభతర వాణిజ్య సంస్కణలు అమలు చేసినందుకు కేంద్రం ఈ వెలుసులుబాటు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐదు రాష్ట్రాలకు కలిసి రూ.16,728 కోట్లు తీసుకునే వీలుంది. ఒకే దేశం – ఒకే రేషన్‌, పట్టణ స్థానిక సంస్థలు, విద్యుత్‌ రంగ సంస్కరణలు అమలు చేసినందుకు అదనపు రుణాలు తీసుకునే వెలుసులు బాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది.