పంజావిసిరిన మావోలు.. ఐదుగురు పోలీసులు మృతి

Maoists attack, పంజావిసిరిన మావోలు.. ఐదుగురు పోలీసులు మృతి

జార్ఖండ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. సరైకెలా జిల్లాలో కూంబింగ్ చేపడుతున్న పోలీసుల వాహనంపై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పోలీసుల నుంచి ఆయుధాలను తీసుకుని మావోయిస్టులు పరారయ్యారు. విషయం తెలిసిన వెంటనే జంషెడ్‌పూర్ సిటీ పోలీస్ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ అదనపు బలగాలతో ఘటనా స్థలికి చేరుకున్నారు.

జార్ఖండ్-బెంగాల్ సరిహద్దుల్లోని తిరుల్డిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టుల దాడిలో ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారని సబ్ డివిజనల్ పోలీసు అధికారి తెలిపారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *