పౌరసత్వ చట్టంపై నిరసనలు: బెంగాల్‌లో ఐదు రైళ్లకు నిప్పు!

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా లాల్గోలా రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఐదు రైళ్లకు నిప్పంటించారు. ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ చట్టంపై భగ్గుమన్న నిరసనకారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లను అడ్డుకోవడం, రైలు సేవలకు అంతరాయం కలిగించడం కొనసాగించారు. ముఖ్యంగా అస్సాంలో కర్ఫ్యూకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనలు తెలిపారు. దీంతో పోలీసు కాల్పులు జరపగా ఇద్దరు మరణించారు. అయితే.. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు పాక్షికంగా సడలించడంతో శాంతియుత వాతావరణం నెలకొంది. ఈ రోజు […]

పౌరసత్వ చట్టంపై నిరసనలు: బెంగాల్‌లో ఐదు రైళ్లకు నిప్పు!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 15, 2019 | 10:41 AM

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా లాల్గోలా రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఐదు రైళ్లకు నిప్పంటించారు. ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ చట్టంపై భగ్గుమన్న నిరసనకారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లను అడ్డుకోవడం, రైలు సేవలకు అంతరాయం కలిగించడం కొనసాగించారు. ముఖ్యంగా అస్సాంలో కర్ఫ్యూకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనలు తెలిపారు. దీంతో పోలీసు కాల్పులు జరపగా ఇద్దరు మరణించారు. అయితే.. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు పాక్షికంగా సడలించడంతో శాంతియుత వాతావరణం నెలకొంది.

ఈ రోజు ఉదయం హౌరాలోని సంక్రైల్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో వందలాది మంది నిరసనకారులు రోడ్లపై బైఠాయించారు. రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ కు నిప్పంటించారు. వారు కొన్ని దుకాణాలకు కూడా నిప్పంటించారని పోలీసు వర్గాలు తెలిపాయి. “మధ్యాహ్నం తరువాత, వారు స్టేషన్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించి టికెట్ కౌంటర్‌కు నిప్పంటించారు. ఆర్‌పిఎఫ్, రైల్వే సిబ్బంది వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, వారు తిరగబడ్డారు” అని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి పేర్కొన్నారు.