Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్‌ రాంబాబు టీవీ9 గుడ్‌మార్నింగ్ ఇండియాలో చెప్పినట్టుగానే పాజిటివ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి.
  • ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం కరెక్ట్‌ కాదంటున్నారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు. అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తామనడం సబబు కాదన్నారు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొన్నిచోట్ల ప్రభుత్వ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిరునాళ్లను తలపిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు.
  • కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. టెలీ మెడిసిన్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు కేంద్రమే నిర్ణయించాలంటున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.

“మేం 15 కోట్ల మందిమే.. కానీ మీ 100 కోట్ల మందికి సరిపోతాం..” ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

five crore Muslims can dominate over Hundred crore Hindus.. we will snatch away our ‘Azadi’: Waris Pathan in Karnataka, “మేం 15 కోట్ల మందిమే.. కానీ మీ 100 కోట్ల మందికి సరిపోతాం..” ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఉత్తర భారతంలోనే ఎక్కువగా జరిగిన ఈ ఆందోళనలు.. క్రమేపి దక్షిణ భారతంలో కూడా ఊపందుకుంటున్నాయి. తాజాగా ఫిబ్రవరి 16న కర్ణాటకలోని గుల్బర్గాలో సీఏఏకి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. అయితే ఈ సభలో మహారాష్ట్రకి చెందిన ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారీస్ పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

స్వాతంత్ర్యం అన్నది అడుక్కుంటే వచ్చేది కాదని అన్నారు. మేం కేవలం 15కోట్ల మందిమే ఉన్నాం కానీ.. మీ 100కోట్లమందిపై ఆధిపత్యం చూపగలం అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తేల్చుకుందామా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయితే పఠాన్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో.. అదే వేదికపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు.

కాగా, గతంలో ఓవైసీ సోదరుడు అక్బరుద్ధీన్ కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో 15నిమిషాలు గడువిచ్చి.. పోలీసులని పక్కకి తప్పిస్తే మేమేంటో చూపిస్తామంటూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత అరెస్ట్, షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరోసారి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో.. మరోసారి కేసు నమోదైంది. అయితే ఇప్పుడు వారిస్ పఠాన్ కూడా.. అక్బరుద్దీన్ తరహాలోనే వ్యాఖ్యలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే వారిస్ పఠాన్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్రకి చెందిన బీజేపీ నేత పరిమల్ దేశ్ పాండే పుణేలోని డెక్కన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Related Tags