Breaking News
  • విశాఖ: ఉత్తర బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం. దీనికి అనుబంధముగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉ౦ది. రాగల 2 రోజులలో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి దక్షిణ కోస్తా తమిళనాడు వరకు ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 1.5 km ఎత్తు వరకు ఏర్పడింది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం లలోఈ రోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం. రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం .
  • చెన్నై : ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి ఫై వీడియో విడుదల చేసిన ఎస్పీ చరణ్ . నాన్నగారికి కరోనా టెస్ట్ రిపోర్ట్ నెగెటివ్ అని నేను మీడియా కి చెప్పమన్నాను . కానీ నేను పూజలో ఉండడం వల్ల సరిగ్గా ప్రెస్ కి మెసేజ్ పాస్ చేయలేక పోయాను . కరోనా నెగెటివ్ అని నేనే మీడియా కి మెసేజ్ పాస్ చేశాను ,తరువాత తెలిసింది ఇంకా నెగెటివ్ రాలేదని . నాన్నగారు నిదానంగా కోలుకుంటున్నారు ,వెంటిలేటర్ సహాయం తో ఎకేమో థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు . నేను నాన్నగారితో మాట్లాడాను .సినీ ప్రముఖులు ,అభిమానులు ఎస్పీబీ కోలుకోవాలని చేస్తున్న పూజల గురుంచి వివరించాను . నాన్నగారు చాల ధైర్యం గా ఉన్నారు ,ఈరోజు నుండి నేను రోజు నాన్నగారిని కలవచ్చని వైద్యులు తెలిపారు . వైద్యులందరికి మా కుటుంబం రుణపడి ఉంటుంది ,నాన్నగారు త్వరగా కోలుకుంటారని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
  • ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రెండు కోట్లు వసూలు. తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. కేసు నమోదు తెలంగాణ వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లు వసూలు . ఉద్యోగాలు ఇవ్వకుండా మోసానికి పాడుపడ్డ ఫరీద్ వ్యక్తిని అరెస్టుచేసి CCS పోలీసులు ఫరీద్ ను కోర్టులో హాజరుపర్చిన సిసిఎస్ పోలీసులు.
  • తూ. గో: పిఠాపురం ప్రముఖ దేవాలయాలలో కరోనా కలకలం. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో 13 మంది సిబ్బందికి కరోన. మరో ఆలయం కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం పాదగయలో ముగ్గురు సిబ్బందికి మొత్తం 16 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు.
  • చెన్నై : చెన్నై విమానాశ్రయం లో పట్టుబడ్డ బంగారం ,ఏపీ ,తెలంగాణ కి చెందిన ముగ్గురు అరెస్ట్ . సౌదీ అరేబియా నుండి చెన్నై కి అక్రమంగా బంగారం తరలిస్తున్నట్టు గుర్తించిన అధికారులు . హైదరాబాద్ కి చెందిన ఇద్దరు ,విజయవాడకి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్న అధికారులు . ముగ్గురు దగ్గర నుండి 696 గ్రాములు ( 24k 6 బిస్క్యూట్ ) లను స్వాధీనం ,పట్టుబడ్డ బంగారం విలువ 38 లక్షలు . కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన కస్టమ్స్ అధికారులు.
  • అమరావతి: వృత్తి పన్ను పెంచుతూ ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం. గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు సవరణలు చేస్తూ నోటిఫికేషన్. ఆదాయాన్ని పెంచుకునే దిశగా కొన్ని కేటగిరీలకు వృత్తి పన్నును పెంచుతూ సవరణ నోటిఫికేషన్‌ జారీ. వృత్తి పన్నులకు చెందిన రెండు శ్లాబులకు గానూ ఓ శ్లాబులో వృత్తి పన్నును పెంపుదల చేస్తూ ఉత్తర్వులు. 1250 రూపాయలు గా ఉన్న వృత్తి పన్ను శ్లాబును రూ. 2000కు పెంచిన ప్రభుత్వం.
  • గులాం నబీ ఆజాద్ నివాసంలో కీలక భేటీ. భేటీకి హాజరైన మనీష్ తివారీ, శశి థరూర్, కపిల్ సిబల్. సోనియాకు లేఖ రాసినవారిలో ఈ నలుగురు. వర్కింగ్ కమిటీ భేటీ అనంతరం నేతల భేటీకి ప్రాధాన్యత.

స్నానం చేసేటప్పుడు అలా చేయడం.. చాలా ప్రమాదమట

బాత్రూమ్ ను మనం చాలా రెగ్యులర్ గా వినియోగిస్తుంటాం. అంతేకాదు మన శరీరం శుభ్రం చేసుకోవడానికి రకరకాల పద్దతులను పాటిస్తాం.
Body Health From All Diseases, స్నానం చేసేటప్పుడు అలా చేయడం.. చాలా ప్రమాదమట

Body Health From All Diseases: బాత్రూమ్ ను మనం చాలా రెగ్యులర్ గా వినియోగిస్తుంటాం. అంతేకాదు మన శరీరం శుభ్రం చేసుకోవడానికి రకరకాల పద్దతులను పాటిస్తాం. ఈ నేపథ్యంలో మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అవి శరీరంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక వీటి నుంచి తప్పించుకునేందుకు నిపుణులు కొన్ని సలహాలిస్తున్నారు.

1. చాలా వేడిగా.. లేదా చాలా చల్లగా మనం నీళ్లు పోసుకుంటే.. స్కిన్ టిష్యూస్  దెబ్బతింటాయట.

2. ఎక్కువ సమయం పాటు షవర్ లో ఉంటే స్కిన్ లో ఉండే మాయిశ్చర్ శాతం తగ్గిపోయి స్కిన్ డ్రై గా మారిపోతుందట. ఫలితంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయట.

3. కొంతమంది తెల్లగా అయిపోవాలనే ఆత్రుతతో ఎక్కువ సేపు శరీరంపై స్క్రబ్ చేస్తారు. అలా చేయడం వల్ల చర్మ పై భాగం పగిలిపోయి ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుందట.

4. షాంపూ వినియోగించిన తర్వాత కండిషనర్ ఉపయోగించకపోతే జుట్టు డ్రైగా తయారై.. ఆకర్షణ పోతుందట.

5. స్నానం చేసిన తర్వాత గట్టిగా రుద్దుకోకూదట. అలా చేయడం వల్ల జుట్టు, చర్మానికి హానీ కలుగుతుందట.

Also Read:

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..

Related Tags