కిషన్ రెడ్డికి సెక్రటరీ రేసులో ఐదుగురు అధికారులు..?

ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డికి సెక్రటరీగా వెళ్లేందుకు ఐదుగురు రేసులో ఉన్నారు.  తెలంగాణకు చెందిన నలుగురు ఐఏఎస్‌లు, ఏపీకి చెందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. వారిలో నల్గొండ జిల్లాకు ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు భద్రాద్రి-కొత్తగూడెం కలెక్టర్ రజత్ కుమార్, జీహెచ్‌ఎంసీలో పనిచేస్తోన్న అమ్రపల్లి కాట. రాష్ట్ర సమాచార కమిషన్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:40 pm, Thu, 13 June 19
కిషన్ రెడ్డికి సెక్రటరీ రేసులో ఐదుగురు అధికారులు..?

ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డికి సెక్రటరీగా వెళ్లేందుకు ఐదుగురు రేసులో ఉన్నారు.  తెలంగాణకు చెందిన నలుగురు ఐఏఎస్‌లు, ఏపీకి చెందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. వారిలో నల్గొండ జిల్లాకు ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు భద్రాద్రి-కొత్తగూడెం కలెక్టర్ రజత్ కుమార్, జీహెచ్‌ఎంసీలో పనిచేస్తోన్న అమ్రపల్లి కాట. రాష్ట్ర సమాచార కమిషన్ సెక్రటరీ కె. ఇలంబరితి ఉన్నట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇక వీరితో పాటు ఏపీలో ఐపీఎస్‌గా పనిచేస్తోన్న డాక్టర్. సీఎం త్రివిక్రమ్ వర్మ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే కిషన్ రెడ్డి సెక్రటరీ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాదే తుది నిర్ణయమని.. దానికి సంబంధించి ఈ వారంలోపు ఆయన ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.