28 రోజుల్లో 47 కరోనా కేసులు: ఈటల

కోవిడ్-19 భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. కొన్ని చోట్ల వైరస్‌ సోకిన వారికి సరైన వైద్యసేవలు అందించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ వైద్య

28 రోజుల్లో 47 కరోనా కేసులు: ఈటల
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2020 | 3:18 PM

కోవిడ్-19 భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. కొన్ని చోట్ల వైరస్‌ సోకిన వారికి సరైన వైద్యసేవలు అందించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ వైద్య సదుపాయాలు ఉన్నాయని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో వైద్య శాఖ ఉన్నతాధికారులు, వైద్య కళాశాలల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో.. రాష్ట్రంలో 28 రోజుల్లో 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని, కొందరిని రెండు..మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని చెప్పారు.

కాగా.. కేవలం కరోనా వ్యాధిగ్రస్తులకు మాత్రమే చికిత్స అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రైవేటు వైద్య కళాశాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉందన్నారు. మొదట ప్రభుత్వ ఆస్పత్రులను వాడుకొనేలా, రెండో దశలో ప్రైవేటు వైద్య కళాశాలలను వాడుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. కరోనా చికిత్స అందించేందుకు ప్రైవేటు వైద్యకళాశాలలు వారంలో సిద్ధం కావాలని సూచించారు. ప్రైవేటు వైద్యులకు ప్రభుత్వమే వసతులు కల్పిస్తుందని తెలిపారు. బాధితుల కోసం 10వేల పడకలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 700 ఐసీయూలు, 190 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. కరోనా బాధితుల్లో ఏ ఒక్కరూ విషమ పరిస్థితుల్లో లేరని ఈటల రాజేందర్‌ తెలిపారు.