Corona medicine: కరోనాకి కొత్త మందు… విపరీతంగా కొనేస్తున్న ప్రజలు…

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి.  కరోనా వైరస్ నుంచి బయటపడుతున్న చైనా... ఏయే మందులు వాడిందో... ఆ మందులను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తెగ కొంటున్నారు

Corona medicine: కరోనాకి కొత్త మందు... విపరీతంగా కొనేస్తున్న ప్రజలు...
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 4:18 PM

Aantacid: కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి.  కరోనా వైరస్ నుంచి బయటపడుతున్న చైనా… ఏయే మందులు వాడిందో… ఆ మందులను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తెగ కొంటున్నారు. తాజాగా… గ్యాస్, గుండెల్లో మంటను తగ్గించడానికి వాడే… యాంటీ యాసిడ్ మందు… ఫెమోటీడైన్ (Famotidine)… ఏ మందుల షాపులో ఉన్నా… వెంటనే కొనేస్తున్నారు. ఎందుకంటే… ఇది కరోనాకి చక్కగా బ్రేక్ వేస్తోందని చైనాలో తేలింది.

కాగా.. ఈ టాబ్లెట్ రేటు 40 పైసల కంటే తక్కువే. రూపాయికి రెండు లేదా మూడు వస్తాయి. ఇంత తక్కువ రేటు మందు… కరోనాని ఆపుతుందంటే… ఆనందమే కదా. అందుకే ప్రజలంతా దీన్ని కొనుక్కుని స్టాక్ పెట్టుకుంటున్నారు. చైనాలోని వుహాన్‌లో కరోనా పేషెంట్లకు చాలా టాబ్లెట్లు ఇచ్చారు. వాటిలో ఫెమోటీడైన్ కూడా ఉంది. ఇది బాగా పనిచేస్తుందని… సైన్స్ మ్యాగ్ అనే మేగజైన్ తెలిపింది. నిజానికి చైనా… వుహాన్‌లో.. 80 ఏళ్లు దాటిన… గుండె మంట ఉండేవారికి ఈ మందును ఇచ్చింది.

మరోవైపు.. అనూహ్యంగా… ఈ మందు… కరోనాకి కూడా కొంతవరకూ బ్రేక్ వేసింది. ఈ మందు వాడని వారిలో 27 శాతం మంది చనిపోగా… వాడిన వారిలో 14 శాతం మంది చనిపోయారు. అసలీ మందులో… ఏ ఫార్ములా… కరోనాకి బ్రేక్ వేసింది అన్నది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు అమెరికా… న్యూయార్క్‌లోని నార్త్‌వెల్‌ ఆస్పత్రిలో 1,170 మంది రోగులపై ఫెమోటీడైన్‌ను పరీక్షిస్తున్నారు. ఇది తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ మందుని పెద్ద ఎత్తున రెడీ చెయ్యమని ఆదేశించింది. స్టాక్ ఉంచమని చెప్పింది.