తాలిబన్ ఉగ్రవాదుల దాడి.. ఆర్మీ అధికారులకు, జవాన్లకు గాయాలు..

ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్లకు ప్రభుత్వానికి మధ్య విభేధాలు ఏర్పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆఫ్ఘన్‌ జవాన్లే లక్ష్యంగా తాలిబన్లు దాడులకు దిగుతున్నారు. తాజాగా శనివారం మరోసారి కాబూల్‌లో తాలిబన్లు దాడికి..

తాలిబన్ ఉగ్రవాదుల దాడి.. ఆర్మీ అధికారులకు, జవాన్లకు గాయాలు..
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2020 | 7:42 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్లకు ప్రభుత్వానికి మధ్య విభేధాలు ఏర్పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆఫ్ఘన్‌ జవాన్లే లక్ష్యంగా తాలిబన్లు దాడులకు దిగుతున్నారు. తాజాగా శనివారం మరోసారి కాబూల్‌లో తాలిబన్లు దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఆఫ్ఘన్‌ పోలీసు ఆఫీసర్లు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు ఆర్మీ జవాన్లు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆఫ్ఘన్‌ మీడియా ప్రచురించింది.ఓ అధికారిక భవనం దగ్గర పనులు జరుగుతుండగా.. పోలీసు అధికారులు, ఆర్మీ జవాన్లు అక్కడ ఉన్న సమయంలో.. శక్తి వంతమైన బాంబు పేలడంతో ఈ ఘటన జరిగిందని పేర్కొంది.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అధికారులను, ఆర్మీ జవాన్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు ధాటికి డిఫెన్స్ అధికారి వాహనం కూడా ధ్వంసమైంది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తాలిబన్ ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టగా.. వారు మరోసారి కాల్పులు జరుపుతూ పారిపోయారని అధికారులు తెలిపారు. కాగా, గత కొద్ది రోజులుగా దేశం నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోవాలంటూ తాలిబన్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. అమెరికా సంధితో ఆఫ్ఘన్ ప్రభుత్వం ఒప్పుకున్న ప్రకారం.. 5972 మంది తాలిబన్లను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఇప్పటికే నాలుగు వేలకు పైగా తాలిబన్లను ఆఫ్ఘన్ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే మరో 592 మందిని విడుదల చేయడం కుదరదని పేర్కొంది.