ఫోర్జరీ సంతకంతో రూ. 25 లక్షలు మోసం!

యజమాని సంతకం ఫోర్జరీ చేసి రూ. 25 లక్షల మోసం చేసిన నలుగురిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరుకు చెందిన రాజారాం కాస్మెటిక్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. వివిధ రాష్ట్రాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా గతేడాది బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 10, సిక్స్‌ అవెన్యూలో ఎస్‌ఆర్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాడు. నగరానికి చెందిన సీహెచ్‌ రాఘవేంద్ర, సత్యవాణి రామానుజం దంపతులు రాజారాంను కలిశారు. తాము పెద్ద కంపెనీల్లో పనిచేసినట్టు చెప్పారు. రాజారాం […]

ఫోర్జరీ సంతకంతో రూ. 25 లక్షలు మోసం!
Follow us

| Edited By:

Updated on: Apr 16, 2019 | 9:27 AM

యజమాని సంతకం ఫోర్జరీ చేసి రూ. 25 లక్షల మోసం చేసిన నలుగురిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరుకు చెందిన రాజారాం కాస్మెటిక్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. వివిధ రాష్ట్రాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా గతేడాది బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 10, సిక్స్‌ అవెన్యూలో ఎస్‌ఆర్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాడు. నగరానికి చెందిన సీహెచ్‌ రాఘవేంద్ర, సత్యవాణి రామానుజం దంపతులు రాజారాంను కలిశారు. తాము పెద్ద కంపెనీల్లో పనిచేసినట్టు చెప్పారు. రాజారాం వారికి రీజనల్‌ మేనేజర్‌గా వెల్‌నెస్‌ సెంటర్‌ ఇన్‌చార్జిగా ఉద్యోగం ఇచ్చాడు. కొద్ది రోజుల్లో వీరిద్దరూ అనిల్‌, చిరంజీవిని ఉద్యోగంలోకి తీసుకున్నారు.

గత నెలలో విజయవాడకు చెందిన కె. సూర్యదుర్గాప్రసాద్‌ అనే వ్యక్తి వద్ద ఫ్రాంచైజీ పేరిట నలుగురూ కలిసి రూ. 10 లక్షలు తీసుకున్నట్టు, ఇందుకోసం రాజారాం సంతకాలు ఫోర్జరీ చేసినట్టు తెలిసింది. అసలేం జరుగుతుందోనని ఆయన పరిశీలించగా సంస్థలో కొన్ని బిల్లులు కూడా కంపెనీ ఖాతాలో జమ కాలేదని తేలింది. మొత్తం రూ. 25 లక్షలు మోసం చేసినట్టు గ్రహించాడు. సోమవారం నగరానికి వచ్చిన రాజారాం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాఘవేంద్ర, సత్యవాణి, జమ్ము అనిల్‌, చిరంజీవిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.