ప్రహరీ గోడ కూలి.. నలుగురు దుర్మరణం

ఒడిషాలో విషాదం చోటుచేసుకుంది. డెంకనాల్ జిల్లాలోని ఆళాసువా కూరగాయల మార్కెట్‌లో ఓ ప్రహరీ గోడ కూలింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. మార్కెట్ యార్డులోని ఓ రైస్ మిల్ కు చెందిన ప్రహరీ గొడ కూలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఒడిషా విపత్తు నిర్వహణ శాఖ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *