అయోధ్య ఉగ్రదాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు

2005లో అయోధ్యలోని రామజన్మభూమి కాంప్లెక్స్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మరోకరికి ఈ కేసు నుండి విముక్తిని కల్పించింది. 2005 జూలై 5వ తేదీన అయోధ్యలోని జైషే మహ్మద్ తీవ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక కోర్టు ఈ కేసులో పట్టుబడ్డ నిందితులు ఇన్నాళ్లూ నాయిని కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. ఇర్ఫాన్‌ మొహమ్మద్‌ షకీల్‌, మొహమ్మద్‌ సనీమ్‌, మొహమ్మద్‌ అజీజ్‌, ఆసిఫ్‌ ఇక్బాల్‌, ఫరూఖ్‌ ఇన్నాళ్లు విచారణ ఎదుర్కొన్నారు. […]

అయోధ్య ఉగ్రదాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2019 | 9:04 PM

2005లో అయోధ్యలోని రామజన్మభూమి కాంప్లెక్స్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మరోకరికి ఈ కేసు నుండి విముక్తిని కల్పించింది. 2005 జూలై 5వ తేదీన అయోధ్యలోని జైషే మహ్మద్ తీవ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక కోర్టు ఈ కేసులో పట్టుబడ్డ నిందితులు ఇన్నాళ్లూ నాయిని కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. ఇర్ఫాన్‌ మొహమ్మద్‌ షకీల్‌, మొహమ్మద్‌ సనీమ్‌, మొహమ్మద్‌ అజీజ్‌, ఆసిఫ్‌ ఇక్బాల్‌, ఫరూఖ్‌ ఇన్నాళ్లు విచారణ ఎదుర్కొన్నారు.

కాగా ఈ ఉగ్ర దాడిలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. వారిలో ఐదుగురు జైష్‌ ఎ మొహమ్మద్‌ అనుమానిత సభ్యులు, ఇద్దరు స్థానికులు ఉన్నారు. మరో ఏడుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఈ దాడిలో గాయపడ్డారు. ఆ సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు ఈ ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు వీరంతా సాయం చేశారన్న అనుమానాలతో అప్పట్లో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఆ రోజే మట్టుబెట్టాయి.