బీజేపీ విజయోత్సవ ర్యాలీపై బాంబు దాడులు..

పశ్చిమ బెంగాల్‌లో ఇంకా ఘర్షణ వాతావరణం తగ్గట్లేదు. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి టీఎంసీ, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లు ఉంటుంది. అయితే ఇటీవల వెలువడిన ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా వెస్ట్ బెంగాల్‌లో పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని టీఎంసీ పార్టీకి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీర్‌బమ్ జిల్లాలో బీజేపీ అద్భుత విజయం సాధించడంతో అక్కడి కమలదళం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అయితే అక్కడి టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. […]

బీజేపీ విజయోత్సవ ర్యాలీపై బాంబు దాడులు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 29, 2019 | 10:21 AM

పశ్చిమ బెంగాల్‌లో ఇంకా ఘర్షణ వాతావరణం తగ్గట్లేదు. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి టీఎంసీ, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లు ఉంటుంది. అయితే ఇటీవల వెలువడిన ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా వెస్ట్ బెంగాల్‌లో పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని టీఎంసీ పార్టీకి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీర్‌బమ్ జిల్లాలో బీజేపీ అద్భుత విజయం సాధించడంతో అక్కడి కమలదళం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అయితే అక్కడి టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. బీజేపీ చేపట్టిన ర్యాలీపై కొందరు బాంబులు విసిరారు. ఈ దాడిలో నలుగురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, తమపై దాడి చేసింది టీఎంసీ కార్యకర్తలే అని బీజేపీ నేతలు ఆరోపించారు. అటు తృణమూల్ నేతలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. బాంబు దాడి తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ముందస్తు జాగ్రత్తగా అక్కడ భారీగా బలగాలను మోహరించారు.