జార్ఖండ్‌లో భూ ప్రకంపనలు

జార్ఖండ్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.07 గంటలకు రాష్ట్రంలోని సహీబ్‌గంజ్‌ ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3 మాగ్నిట్యూడ్‌గా..

జార్ఖండ్‌లో భూ ప్రకంపనలు
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2020 | 3:45 PM

జార్ఖండ్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.07 గంటలకు రాష్ట్రంలోని సహీబ్‌గంజ్‌ ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. సహీబ్‌గంజ్‌ ప్రాంతానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. కాగా, గత కొద్ది రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిత్యం భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే వీటి తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగడం లేదు.

Read More :

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కేంద్రమంత్రికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం