Breaking News
  • ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌. దిశ చట్టంపై జగన్‌ను అభినందించిన అనిల్‌ దేశ్‌ముఖ్‌. మహారాష్ట్రలో దిశ చట్టం అమలుకు పరిశీలిస్తామన్న దేశ్‌ముఖ్‌.
  • చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడ్డ బంగారం. 12.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.44 కోట్లు ఉంటుందని అంచనా. మలేషియా, సింగపూర్‌ నుంచి బంగారం తరలిస్తున్నట్టు గుర్తింపు. 18 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు.
  • స్థానిక ఎన్నికల్లో పోటీపై పురంధేశ్వరి నేతృత్వంలో కమిటీ వేశాం. రాజధాని అమరావతిలోనే ఉండేలా కార్యాచరణ ప్రకటిస్తాం-కన్నా. ఎంపీల గైర్హాజరును పెద్దది చేయాల్సిన అవసరం లేదు. వారివారి వ్యక్తిగత కారణాలతో రాలేమని ముందే చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు గురించి నాకు సమాచారం లేదు. ఈనెల 25లోగా టీఎస్‌ కొత్త అధ్యక్షుడిపై స్పష్టత వస్తుంది. -ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.
  • ఢిల్లీ: షాహిన్‌బాగ్‌లో ఆందోళనకారులతో మధ్యవర్తుల చర్చలు. ఎటూ తేలకుండానే రెండో రోజు ముగిసిన చర్చలు. ఆందోళనలు విరమించాలని షాహిన్‌బాగ్‌ వాసులను కోరిన మధ్యవర్తులు. సీఏఏను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్న ఆందోళనకారులు. నిరసనలు చేసుకోవచ్చు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న మధ్యవర్తులు. లేదంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందన్న మధ్యవర్తులు.
  • ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో నేను లేను.. అది కేంద్ర నిర్ణయం. మాకు ఎవరితోనూ పొత్తు లేదు.. జనసేనతో మాత్రమే మా పొత్తు -మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి.
  • విజయవాడ: వివేకానందరెడ్డి హత్యకేసుపై హైకోర్టులో విచారణ. విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.

కేటీఆర్ చొరవ.. స్వదేశానికి తిరిగొచ్చిన 39 మంది

Saudi Arabia, కేటీఆర్ చొరవ.. స్వదేశానికి తిరిగొచ్చిన 39 మంది

పొట్టకూటికోసం దేశం విడిచి సౌదీ వెళ్లిన వారికి అష్టకష్టాలు ఎదురయ్యాయి. నమ్ముకుని వెళ్లిన ఆ కంపెనీ మూతపడటం.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో.. వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సౌదీలోని నిర్మాణరంగ సంస్థ జేఅండ్‌పీలో పనిచేసేందుకు గత ఏడాది కరీంనగర్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన దాదాపు 60 మంది కార్మికులు వెళ్లారు. అయితే అకస్మాత్తుగా ఆ కంపెనీ మూతపడటంతో వారంతా ఉపాది కోల్పోయారు. గత ఆరు నెలలుగా జీతాలు లేక నానావస్థలు పడ్డారు. దీంతో చేసేదేమి లేక ఆ కార్మికులు వారి సమస్యలను ట్విటర్‌ ద్వారా కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం, సౌదీలోని భారత రాయబార కార్యాలయంకు విషయాన్ని తెలిపింది. విషయం తెలుసుకున్న తెలంగాణ ఎన్నారై శాఖ వారికి తోడుగా నిలిచింది. వారిని స్వదేశానికి పంపేదందుకు తాత్కాలిక ఎగ్జిట్ వీసాలు, విమాన టికెట్లను సమకూర్చారు. దీంతో సోమవారం రాత్రి వారంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లను ఎన్నారై శాఖ అధికారి ఇ.చిట్టిబాబు పర్యవేక్షించారు. కార్మికులను స్వదేశానికి రప్పించడానికి సహకరించిన సౌదీలోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై శాఖ అధికారులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Related Tags