జూరాలకు వరద ఉదృతి.. 39 గేట్లు ఎత్తివేత..!

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉదృతి భారీగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తూ జలకళ సంతరించుకుంది. పోటెత్తుతున్న వరదతో కృష్ణమ్మ

జూరాలకు వరద ఉదృతి.. 39 గేట్లు ఎత్తివేత..!
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2020 | 1:33 PM

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉదృతి భారీగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తూ జలకళ సంతరించుకుంది. పోటెత్తుతున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3 లక్షల 35 వేల క్యూసెక్కులు కాగా, అవుట్‌ ఫ్లో 3 లక్షల 38 వేల 733 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం318.07 మీటర్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటిసామర్ద్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.75 టీఎంసీలుగా ఉంది.

కాగా.. భారీ వరద ఉదృతి కారణంగా.. కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులకు నీటి పంపింగ్ కొనసాగిస్తున్నారు. నారాయణపూర్‌ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. నదీ తీర గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు ఎవరు నదిలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్‌ కేంద్రాల్లో 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన నిరాటంకంగా కొనసాగుతుంది.

Also Read: ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్‌ ఐసోలేషన్‌..!

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన