35 ఏళ్ళు దాటారా ? మీకు ఇక డేంజరే.. !!

మతిమెరుపు ఎప్పుడొస్తుంది ? ఈ ప్రశ్నకేవరైనా ఇట్టే సమాధానం చెప్తారు.. వృద్ధాప్యం వస్తే మతిమరుపు రావడం ఖాయమని.. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయ్యింది. కేవలం 35 ఏళ్ళు దాటితే చాలు మనుషులకు మతిమరుపు వచ్చేస్తుందట ! ఈ మాట అంటున్నది ఎవరో కాదు మనుషుల మెదళ్లపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలే ఈ మాట చెపుతున్నారు. కారణం వింటే షాక్ ! డెమెన్షియా….వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి. సాధారణంగా ఇది 60-65ఏండ్ల పైబడిన వారిలో వస్తుంది. కానీ […]

35 ఏళ్ళు దాటారా ? మీకు ఇక డేంజరే.. !!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 21, 2019 | 5:43 PM

మతిమెరుపు ఎప్పుడొస్తుంది ? ఈ ప్రశ్నకేవరైనా ఇట్టే సమాధానం చెప్తారు.. వృద్ధాప్యం వస్తే మతిమరుపు రావడం ఖాయమని.. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయ్యింది. కేవలం 35 ఏళ్ళు దాటితే చాలు మనుషులకు మతిమరుపు వచ్చేస్తుందట ! ఈ మాట అంటున్నది ఎవరో కాదు మనుషుల మెదళ్లపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలే ఈ మాట చెపుతున్నారు.

కారణం వింటే షాక్ !

డెమెన్షియా….వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి. సాధారణంగా ఇది 60-65ఏండ్ల పైబడిన వారిలో వస్తుంది. కానీ ప్రస్తుతం 30-35 ఏండ్ల వయస్సు వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపిస్తుండడం యువతను ఆందోళనకు గురిచేస్తోంది. చిన్నవయస్సులో మతిమరుపు వ్యాధి రావడం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ మానసిక వైద్యనిపుణురాలు, ది హైదరాబాద్ అకాడమీ ఆఫ్ సైకాలజి డైరెక్టర్ డాక్టర్ డయాన మంటైరో ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో వచ్చే డెమెన్షియా వ్యాధికి చికిత్సలేదని కేవలం నివారణ ఒక్కటే మార్గమని ఆమె స్పష్టం చేశారు. వ్యాధికి గల కచ్చితమైన కారణాలు కూడా సరిగ్గా చెప్పలేమని అయితే వంశపారంపర్యంగానూ, జీవన విధానం వల్ల మాత్రం వ్యాధి వచ్చే అవకాశాలున్నట్లు ఆమె వివరించారు. 2010వరకు దేశంలో 37లక్షల మంది మతిమరుపు వ్యాధితో బాధపుడుతన్నట్లు ఆరోగ్య సంస్థల సర్వే లెక్కలు చెబుతున్నాయని డా.డయాన తెలిపారు.

లక్షణాలు ఇవే !

* సాధారణ విషయాలు, కుటుంబసభ్యులను మరిచిపోవడం * సొంత ఇంటి చిరునామా మరిచిపోవడం * చాలా నెమ్మదిగా గుర్తుకురావడం * కుటుంబ సభ్యుల పేర్లను మరిచిపోవడం * ఒక చోటకు వెళ్లాల్సింది.. మరో చోటకు వెళ్లిపోవడం

అంతా ఫ్లేక్స్ ప్రభావం వల్లనే.. !

సాధారణంగా మెదడులో ఏదో ఒకచోట ప్లేక్స్(ఒక పొరలాంటిది)ఏర్పడడంతో ఈ మతిమరుపు వ్యాధి మొదలవుతుందని డా.డయాన తెలిపారు. ఈ పొర మెదడులో ఒకచోట ఏర్పడి మొత్తం వ్యాపించడం తో వ్యాధి ముదిరి పూర్తి జ్ఞాపకశక్తి నశిస్తుందని వివరించారు. అయితే వ్యాధిని పైలక్షణాలతో అనుమానించవచ్చన్నారు. లక్షణాలను ఎవరికీ వారే గుర్తించొచ్చు.. !

మతిమరుపు వ్యాధిని సైకలాజికల్ కాంగ్నెటివ్ టెస్ట్‌తో గుర్తించి నిర్ధారించవచ్చని మానసిక వైద్యనిపుణురాలు డా.డయాన తెలిపారు. ఇది ప్రారంభదశలోనే గుర్తిస్తే మంచిదని నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ముదిరి చికిత్సకు వీలులేకుండా పోతుందన్నారు. మతిమరుపు వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స అంటూ ఏది లేదని కేవలం నివారణ ఒక్కటే మార్గమన్నారు.

మతిమరుపు నుంచి తప్పించుకునే మార్గం..

మతిమరుపు వ్యాధికి చికిత్స లేదు కానీ కొన్ని రకాల మానసిక వ్యా యామాలు, ఆలోచనతో కూడిన ఆటపాటలతో వ్యాధిని నియంత్రిచవచ్చని డా.డయాన తెలిపారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న వారు ఈ వ్యాధిబారిన ఎక్కువగా పడుతుంటారని అలాంటి బాధితులకు కుటుంబ సభ్యుల సహాయసహకారాలు, ప్రేమానురాగాలకు మించిన వైద్యం మరొకటి లేదని స్పష్టం చేశారు. వ్యాధి బాధితులను ఒంటిరిగా వదిలేస్తే జబ్బు మరింత ముదిరే ప్రమాదముందని హెచ్చరించారు. ఇక 30-35 ఏండ్ల వయస్సువారిలో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిం చి మానసిక వైద్యం చేయించాల్సి ఉంటుందన్నారు. మతిమరుపుతో బాధపడే వృద్ధ్దుల కోసం నగరంలోని బంజారాహిల్స్‌లో రెడ్‌క్రాస్‌సొసైటీ ఆధ్వర్యంలో డే-కేర్ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు ఆ సెంటర్ డైరెక్టర్ తెలిపారు. 2016లో ఆయూష్ క్ల్లినిక్‌తోపా టు వృద్ధుల కోసం డిమెన్షియా డేకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కేంద్రానికి ప్రతిరోజూ 20మంది ఆశ్రయించి మతిమరుపునకు అవసరమైన మానసిక థెరపీలను పొందుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కేంద్రం ఉదయం 9గంటల నుంచి సాయం త్రం 4గంటల వరకు పని చేస్తుందన్నారు.

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.