ఢిల్లీ : 12 ఏళ్ల బాలిక‌పై అత్యాచారం, దాడి కేసులో నిందితుడు అరెస్ట్

దేశ రాజ‌ధాని ఢిల్లీలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, పాశ‌వికంగా క‌త్తితో దాడి చేసిన కేసులో 33 ఏళ్ల హత్య కేసు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ : 12 ఏళ్ల బాలిక‌పై అత్యాచారం, దాడి కేసులో నిందితుడు అరెస్ట్
Follow us

|

Updated on: Aug 07, 2020 | 4:32 PM

Delhi Rape Case: దేశ రాజ‌ధాని ఢిల్లీలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, పాశ‌వికంగా క‌త్తితో దాడి చేసిన కేసులో 33 ఏళ్ల హత్య కేసు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

“100 సిసిటివి ఫుటేజ్లను ప‌రిశీలించి, అనుమానితులను ప్రశ్నించిన తరువాత, సంఘటనల క్రమాన్ని గ‌మ‌నించిన అనంత‌రం‌ 33 ఏళ్ల వ్యక్తిని మేము అరెస్టు చేసాము. అతని పేరు క్రిషన్. నిందితుడిపై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిలో ఒకటి హత్య కూడా ఉంది ” అని ఢిల్లీ పోలీసు జాయింట్ కమిషనర్ షాలిని సింగ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ కేసు విషయంపై దర్యాప్తు చేయడానికి, నేర‌స్థుల‌ను పట్టుకోవడానికి ఇరవై బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.

కాగా తీవ్ర గాయాల‌పాలైన బాధితురాలు ప్ర‌స్తుతం మృత్యువుతో పోరాడుతోంది. ఆమె ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చికిత్స్ అందిస్తున్నారు. బుధ‌వారం ఆమె గాయాలకు వైద్యులు ఆప‌రేష‌న్ చేశారు. గురువారం రోజు ఎయిమ్స్‌కు వెళ్లి బాధిత బాలిక కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్మించిన ఢిల్లీ సీఎం..ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసిందని చెప్పారు. నేరానికి పాల్ప‌డిన ఉన్మాదులు సామాన్య జ‌నంతో క‌లిసి జీవించే హ‌క్కు లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇది క్రూర‌మైన చ‌ర్య అని పేర్కొన్న ముఖ్య‌మంత్రి..బాలిక గాయాల గురించి వ‌ర్ణించ‌లేమ‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని ప‌శ్చిమ విహార్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

Read More : ఎమ్మెల్యే శ్రీదేవి గొప్ప మ‌న‌సు : గాయ‌ప‌డ్డ వ్య‌క్తికి రోడ్డుపైనే ప్రాథ‌మిక‌ వైద్యం