ఒకే ఆస్పత్రిలో.. 33 మంది వైద్య సిబ్బందికి కరోనా..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. దేశ రాజధానిలో కొత్తగా 33 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఢిల్లీలోని పత్పరంగంజ్‌ ప్రాంతంలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ

ఒకే ఆస్పత్రిలో.. 33 మంది వైద్య సిబ్బందికి కరోనా..
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2020 | 4:51 PM

Max Hospital: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. దేశ రాజధానిలో కొత్తగా 33 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఢిల్లీలోని పత్పరంగంజ్‌ ప్రాంతంలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన 33 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటీవ్ నమోదైంది. కరోనా సోకిన వారిలో ఇద్దరు డాక్టర్లు, 23 నర్సులు, మిగిలినవారు టెక్నీషియన్లు, హెల్పర్స్ ఉన్నారు.

కాగా.. వెంటనే వీరందరినీ సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా, ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఢిల్లీలో కరోనా కేసులు 2918 నమోదు కాగా, 877 మంది కోలుకున్నారు. 54 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.

Also Read: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు..