జల్లికట్టులో విషాదం.. 32మందికి గాయాలు

మకర సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పోటీల్లో విషాదం నెలకొంది. ఈ పోటీల్లో ఇప్పటివరకు 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ యువకులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. అవనియాపురంలో 730, అలంగనళ్లూరులో 700, పలమేడులో 650 ఎద్దులతో పోటీలను నిర్వహిస్తున్నారు. వాటిని అదుపుచేసేందుకు 730మంది ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ పోటీలను చూసేందుకు […]

జల్లికట్టులో విషాదం.. 32మందికి గాయాలు
Follow us

| Edited By:

Updated on: Jan 15, 2020 | 4:11 PM

మకర సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పోటీల్లో విషాదం నెలకొంది. ఈ పోటీల్లో ఇప్పటివరకు 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ యువకులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. అవనియాపురంలో 730, అలంగనళ్లూరులో 700, పలమేడులో 650 ఎద్దులతో పోటీలను నిర్వహిస్తున్నారు. వాటిని అదుపుచేసేందుకు 730మంది ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ పోటీలను చూసేందుకు జనం కూడా పోటెత్తారు. మరోవైపు ఏర్పాట్లకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నఅధికారులు.. గాయపడిన వారి కోసం వెంటనే వైద్య చికిత్స అందించేలా మెడికల్ టీమ్‌లను అందుబాటులో ఉంచారు.