Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

దారుణం: చిన్నారిని బండకేసి కొట్టి చంపిన మేనమామ..

Baby Killed By Her Uncle In Nalgonda, దారుణం: చిన్నారిని బండకేసి కొట్టి చంపిన మేనమామ..

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. పెద్దవూర మండలం చిన్నగూడెంలో ఒక మేనమామ పాశవికంగా ప్రవర్తించాడు. చిన్నారి అని కూడా దయలేకుండా కాళ్లు పట్టి బండకు కొట్టి హత్యచేశాడు. వివరాల్లోకి వెళితే.. చిన్నారి తల్లిదండ్రులు గుంటూరు జిల్లా గొట్టిముక్కల గ్రామంలో నివసిస్తున్నారు. పాప తల్లి లక్ష్మీ డెలివరీ కోసం సొంతూరు చిన్నగూడానికి వచ్చింది. నాలుగు నెలల తర్వాత తిరిగి వెళిపోదామనుకున్నారు. ఇంతలోనే ఏం జరిగింతో తెలియదు మేనమామ ఉపేందర్ చిన్నారని చంపేశాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అభం శుభం తెలియని పసిపాపను పొట్టనబెట్టుకున్నాడని కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఉపేందర్‌ను పోలీసులకు అప్పగించారు. ఇంట్లోవాళ్లను డబ్బులు కావాలని ఉపేందర్ డిమాండ్ చేస్తూ ఉండేవాడని.. వాళ్లు డబ్బులు ఇవ్వకపోవడంతోనే మద్యం తాగి ఆ మత్తులో చిన్నారని చంపేసి ఉంటాడని వారు చెబుతున్నారు. గతంలో కూడా ఉపేందర్ సైకోలా ప్రవర్తించే వాడని అంటున్నారు.

Related Tags