3ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. అట్టుడుకుతోన్న కశ్మీరం

జమ్ముకశ్మీర్‌లో మరో దారుణం జరిగింది. బందిపోర్ జిల్లా సుంబల్ ఏరియాలో మూడేళ్ల అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు. అంతేకాదు తనపై కేసు రాకుండా ఉండేందుకు మైనర్‌నంటూ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. దీనికి ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ సహాయం చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. కశ్మీర్ లోయ అట్టుడుకుతోంది. నిందితులను శిక్షించాలంటూ సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు పలువురు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. త్రిగమ్ అనే గ్రామంలో ఓ చిన్నారికి […]

3ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. అట్టుడుకుతోన్న కశ్మీరం
Follow us

| Edited By:

Updated on: May 13, 2019 | 5:08 PM

జమ్ముకశ్మీర్‌లో మరో దారుణం జరిగింది. బందిపోర్ జిల్లా సుంబల్ ఏరియాలో మూడేళ్ల అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు. అంతేకాదు తనపై కేసు రాకుండా ఉండేందుకు మైనర్‌నంటూ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. దీనికి ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ సహాయం చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. కశ్మీర్ లోయ అట్టుడుకుతోంది. నిందితులను శిక్షించాలంటూ సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు పలువురు డిమాండ్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. త్రిగమ్ అనే గ్రామంలో ఓ చిన్నారికి స్వీట్లు ఇచ్చిన ఓ యువకుడు.. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలపడంతో.. ఆమె తండ్రి నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైద్య పరీక్షలో చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు నిర్దారణ అయింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఇతగాడు తాను మైనర్‌నంటూ ఓ సర్టిఫికేట్‌ను సమర్పించడంతో వివాదం మొదలైంది. గ్రామస్తులు ఆగ్రహంతో ఆ స్కూల్‌ను మూసివేయాలంటూ ఆందోళనను ఉదృతం చేశారు.

దీనిపై సీనియర్ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ప్రిన్సిపల్ జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్ ద్వారా నిందితుడి వయసును నమ్మలేమని.. మెడికల్ టెస్ట్‌ల ద్వారా అతడి కచ్చితమైన ఏజ్ ఎంతో కనుగొంటామని అన్నారు. కాగా ఈ సంఘటన తరువాత ఆ ప్రాంతంలోని పలు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. దీనిపై రాజకీయ నాయకులు కూడా స్పందించారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా, ఒమర్ అబ్దుల్లా తమ ట్వీట్లల్లో ఈ దారుణాన్ని ఖండిస్తూ.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిరసనలు పెద్ద ఎత్తున చెలరేగకుండా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులపై అధికారులు ఆంక్షలు విధించారు.