Breaking News
  • కర్నూలు: సీఎం జగన్‌, ఎంపీ టీజీ వెంకటేష్‌ మధ్య ఆకసక్తికర చర్చ. మాకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందన్న టీజీ వెంకటేష్‌. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరాం. నివేదిక కూడా పంపించామన్న సీఎం జగన్‌. త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చన్న టీజీ వెంకటేష్‌. హైకోర్టు ప్రకటనపై జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన టీజీ వెంకటేష్‌.
  • ప్రజలను కలిసేందుకు చంద్రబాబు వెళ్తుంటే పోలీసుల ఆంక్షలేంటి. చంద్రబాబు పర్యటనతో వైసీపీ ఉలిక్కి పడుతోంది-కూన రవికుమార్‌. మంత్రి బొత్స నోటిని అదుపులో పెట్టుకోవాలి-కూన రవికుమార్‌. విశాఖలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. జగన్‌ను విశాఖ ప్రజలు తరిమికొట్టాలి-టీడీపీ నేత కూన రవికుమార్‌.
  • గోపన్‌పల్లి అక్రమ భూమ్యుటేషన్లపై విచారణకు ఆదేశం. విచారణాధికారిగా రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ నియామకం. సర్వే నెంబర్‌ 127, 128లో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూదందాపై.. విచారణ చేయనున్న రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ. బాధితులను విచారణకు హాజరుకావాలని ఆదేశాలు. అక్రమ భూమ్యుటేషన్ల వ్యవహారంలో మరో ఇద్దరి పాత్ర. రిటైర్డ్ తహశీల్దార్లు సుబ్బారావు, రాజేశ్వర్‌రెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తింపు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసిన కలెక్టర్‌.
  • ఢిల్లీ: పూసాలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వార్షిక సమావేశం. పాల్గొన్న కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌గోయల్‌. తెలంగాణ నుంచి హాజరైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 2019-20 వార్షిక నివేదిక విడుదల.
  • హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ర్యాలీ. అడ్డుకున్న పోలీసులు, సీపీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట. నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిని అరెస్ట్‌. నారాయణగూడ పీఎస్‌కు తరలించిన పోలీసులు.

మోదీ చెప్పినట్టే.. బెంగాల్‌లో టీఎంసీకి షాక్

TMC MLAs joins BJP, మోదీ చెప్పినట్టే.. బెంగాల్‌లో టీఎంసీకి షాక్

మోదీ చెప్పినట్లే జరిగింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీకి వెళ్లిన వారు కాషాయ కండువాను కప్పుకున్నారు. వారిలో బిజ్‌పుర్ నుంచి ఎన్నికైన సుబ్రన్ష్ రాయ్, నోవాపరా నుంచి సునీల్ సింగ్, బర్రాకోప్రే నుంచి గెలిచిన సిల్‌భద్ర దత్తా ఉన్నారు. వీరితో పాటు రాష్ట్రంలోని 24 జిల్లాలకు చెందిన 50మంది కౌన్సిలర్లు బీజేపీ తీర్ధాన్ని పుచ్చుకున్నారు.

కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన మోదీ.. టీఎంసీకి చెందిన 40మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై స్పందించిన మమతా.. దమ్ముంటే ఒక్కరిని తీసుకోండి అంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరేందుకు వెళ్లడంతో మోదీ చెప్పినట్టే జరుగుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం సాధించగా.. పశ్చిమబెంగాల్‌లో 18సీట్లను సాధించింది. మరోవైపు టీఎంసీ 22సీట్లను దక్కించుకుంది.

Related Tags