Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

భూమికంటే అతిభారీ సైజులో.. ఖగోళంలో మరో మూడు కొత్త ఉపగ్రహాలు

planets discovered in nearby solar system vastly different from our own, భూమికంటే అతిభారీ సైజులో.. ఖగోళంలో మరో మూడు కొత్త ఉపగ్రహాలు" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/07/planets-new.png 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/07/planets-new-300x180.png 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/07/planets-new-768x461.png 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/07/planets-new-600x360.png 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

అంతరిక్ష పరిశోధనలో నిరంతరం పరిశోధనలు జరుపుతున్నారు శాస్త్రవేత్తలు. ఖగోళ రహస్యాలను ఎప్పటిప్పుడు మనకు అందించేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. ఇప్పటికే చంద్రుని వద్దకు చంద్రయాన్-2ను పంపించి ప్రపంచ దేశాల్లో మన సత్తా చాటుకున్నాం. అంతరిక్ష పరిశోధనలో ముందున్న నాసా అనేక కొత్త ఆవిష్కరణలు చేస్తూ నింగిలో ఉన్నకొత్త గ్రహాల సమాచారాన్ని తెలియజేస్తుంది. తాజాగా భూమికి 73 కాంతి సంవత్సరాల దూరంలో ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న మూడు కొత్త గ్రహాలను గుర్తించారు.

నాసా పరిశోధనలో వెలుగులోకి వచ్చిన ఈ మూడు ఉపగ్రహాల్లో ఒకటి భూమి పరిమాణం కంటే పెద్దగా ఉంటే, మిగిలిన రెండు ఉపగ్రహాలు భూమి పరిమాణంలో రెండింతలు ఉన్నాయని.. అయితే ఈ రెండు ఉపగ్రహాలు వాయుమయంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కొత్త గ్రహాల అన్వేషణలో నాసా.. ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్‌ను ఉపయోగించింది. దీని ప్రయోగంతోనే ఈ మూడు ఉపగ్రహాల ఉనికి ప్రపంచానికి తెలియజేసేందుకు ఉపయోగపడ్డాయని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు.

మన సౌరవ్యవస్థ పరిధి లక్ష కాంతి సంవత్సరాలు కాగా ఇందులో ఉన్న లక్షలాది నక్షత్ర మండలాల్లో మనది కూడా ఒక్కటని శాస్త్రవేత్త కేన్ తెలిపారు. కొత్తగా గుర్తించిన మూడు ఉపగ్రహాలు భూమికి 73 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయంటే మన భూమికి దగ్గరగానే ఉన్నట్టు భావించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.