ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన విమానం, ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వరద భాదితులకు సహాయం చేసేందుకు వెళ్లిన హెలికాప్టర్‌ ఉత్తరకాశీలో కుప్పకూలింది. మోరీ నుంచి మోల్దీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వరద బాధితులకు కావాల్సిన వస్తుసమాగ్రిని అందించి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్నముగ్గురు సిబ్బంది మృతిచెందినట్లుగా తెలుస్తోంది. మృతులు కెప్టెన్‌ లాల్‌, కో పైలెట్‌ శైలేష్‌, రాజ్‌పాల్‌గా అధికారులు నిర్ధారించారు. అయితే, విమానం ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ వైర్లలో చిక్కుకోవడం కారణంగానే  మంటలు చెలరేగి ప్రమాదం […]

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన విమానం, ముగ్గురు మృతి
Follow us

|

Updated on: Aug 21, 2019 | 5:07 PM

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వరద భాదితులకు సహాయం చేసేందుకు వెళ్లిన హెలికాప్టర్‌ ఉత్తరకాశీలో కుప్పకూలింది. మోరీ నుంచి మోల్దీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వరద బాధితులకు కావాల్సిన వస్తుసమాగ్రిని అందించి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్నముగ్గురు సిబ్బంది మృతిచెందినట్లుగా తెలుస్తోంది. మృతులు కెప్టెన్‌ లాల్‌, కో పైలెట్‌ శైలేష్‌, రాజ్‌పాల్‌గా అధికారులు నిర్ధారించారు.

అయితే, విమానం ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ వైర్లలో చిక్కుకోవడం కారణంగానే  మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. కాగా ప్రమాదానికి గురైన విమానం హెరిటేజ్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందినగా తెలుస్తోందిగత కొద్ది రోజులుగా ఉత్తరకాశి జిల్లాలోని మోరీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉత్తరకాశిలోని నదులన్ని ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు వరదల కారణంగా జనజీవనం అతలాకుతలం అయ్యింది. ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేప్టటింది. ఇందులో భాగంగా మూడు హెలికాప్టర్లతో ఆహార ప్యాకెట్లు, మందులు సహా సహాయక సామాగ్రిని ప్రజలకు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే సహాయక చర్యల్లో విమానం ప్రమాదానికి గురైంది.